E-Paper
Advertisement

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!
Advertisement

Air Conditioner: వేసవిలో కాలంలో ఏసీలకు ఉండే డిమాండ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇళ్లు, ఆఫీసులు, దుకాణాల్లో ఎయిర్ కండీషనర్లు నిత్యవసరంగా మారిపోయాయి. అయితే బెడ్‌రూమ్ లేదా ఆఫీస్ క్యాబిన్ వంటి చిన్న గదుల కోసం చాలామంది 0.5 టన్ (అర టన్ను) ఏసీని ఎంచుకుంటున్నారు. అసలు ఈ ఏసీ ఎంత కరెంట్ వినియోగిస్తుంది? ఎంత సైజ్ ఉన్న గదిని కూల్ చేయగలదు? అనే పూర్తి వివరాలు ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.

గంటకు విద్యుత్ ఖర్చు ఎంతంటే?

సాధారణంగా ఏసీ విద్యుత్ వినియోగం అనేది అది కలిగి ఉన్న స్టార్ రేటింగ్, ఇన్వర్టర్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఒక 0.5 టన్ ఇన్వర్టర్ ఏసీ గంటకు సుమారు 350 నుండి 500 వాట్ల (Watts) విద్యుత్‌ను వినియోగిస్తుంది. దీని ప్రకారం ఏసీని ఒక గంట పాటు నిరంతరాయంగా నడిపితే కేవలం 0.35 నుండి 0.5 యూనిట్ల కరెంట్ మాత్రమే ఖర్చవుతుంది. అంటే మీరు రోజుకు 8 గంటలు ఏసీ ఆన్ చేసినా రోజుకు సుమారు 3 నుండి 4 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగం అవుతుంది. ప్రస్తుతం యూనిట్ విద్యుత్ రూ.7-8 ఉన్న నేపథ్యంలో రోజుకు రూ.21 – 32 మధ్య ఖర్చు అవుతుంది. నెలకు వచ్చే సరికి రూ.630 – 960 మధ్య పవర్ బిల్లు రానుంది. మెుత్తంగా పెద్ద ఏసీలతో పోలిస్తే ఈ ఖర్చు కాస్త తక్కువనే చెప్పవచ్చు.

Advertisement

Also Read: IRCTCకి కాలం చెల్లిందా? కొత్త ‘RailOne’ యాప్ ప్రత్యేకతలు ఇవే!

ఏ సైజ్ గదికి బెస్ట్ అంటే?

0.5 టన్ ఏసీ అనేది కేవలం చిన్న పరిమాణం గల గదులకు మాత్రమే సరిపోతుంది. ఇది 60 నుండి 80 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న చిన్న గదిని సమర్థవంతంగా కూలింగ్ చేస్తుంది. చిన్న స్టడీ రూమ్‌లు, ఆఫీస్ క్యాబిన్లు, సింగిల్ బెడ్ పడకగదులకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ మీ గది పరిమాణం 80 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉంటే 1 టన్ లేదా 1.5
టన్ తీసుకుంటే బెటర్. 0.5 టన్ ఏసీ వల్ల పెద్ద గదులు త్వరగా చల్లబడవు. అలాంటప్పుడు కంప్రెషర్ నిరంతరం పనిచేయడం వల్ల కరెంట్ బిల్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి గది సైజును బట్టి సరైన ఏసీని ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Also Read: అస్సలు మిస్ అవ్వకండి.. ఉచితంగా 20GB డేటా ఇస్తున్న జియో!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×