E-Paper
Advertisement

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!
Advertisement

Tata Avinya X Launch: టాటా మోటార్స్ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ లో మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న అవిన్యా శ్రేణిలో తొలి మోడల్ అవిన్యా Xను 2027లో భారత మార్కెట్లో విడుదల చేయాలని నిర్ణయించింది. కొత్త టెక్నాలజీ, కొత్త ప్లాట్‌ ఫారమ్, గ్లోబల్ కొలాబరేషన్ తో ఈ మోడల్ టాటా EVల భవిష్యత్తుకు ఓ మైల్ స్టోన్ గా నిలువనుంది.

కొత్త ఫ్రీలాండర్ ఆర్కిటెక్చర్‌పై టాటా అవిన్యా X

మొదట్లో అవిన్యా మోడళ్లను జాగ్వార్ ల్యాండ్ రోవర్ అభివృద్ధి చేసిన EMA ప్లాట్‌ ఫారమ్‌ పై నిర్మించాలని టాటా భావించింది. అయితే, తాజాగా కంపెనీ CJLR ఎకోసిస్టమ్‌ లోని ఫ్రీలాండర్ ప్లాట్‌ ఫారమ్‌ ను ఉపయోగించనుంది. ఈ మార్పు ద్వారా అభివృద్ధి ఖర్చులు తగ్గడంతో పాటు వాహనాన్ని మార్కెట్లోకి మరింత వేగంగా తీసుకురావచ్చని కంపెనీ భావిస్తోంది. అవిన్యా X ప్రస్తుతం టాటా మోటార్స్‌ కు అత్యంత ప్రాధాన్యత కలిగిన EV ప్రాజెక్ట్‌ గా మారింది. కంపెనీ అంతర్గతంగా దీనిని P2 ప్రోగ్రామ్‌ గా పిలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఇంజనీరింగ్ ప్రోటో టైప్‌ లు సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ద్వారా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని అర్థమవుతోంది.

Advertisement

అవిన్యా X కేవలం ఒక కొత్త ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు. భవిష్యత్తులో అవినయను ప్రత్యేక ప్రీమియం EV బ్రాండ్‌గా నిలబెట్టే తొలి అడుగుగా టాటా భావిస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్లాట్‌ ఫారమ్ మార్పు వెనుక కూడా ఈ కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. EMA ప్లాట్‌ ఫారమ్‌ ను భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మార్చడం ఖర్చుతో కూడుకున్న ప్రక్రియగా మారిందని సమాచారం. ఫ్రీలాండర్ ప్లాట్‌ ఫారమ్‌ ను ఉపయోగించడం వల్ల ఇప్పటికే సక్సెస్ అయిన సాంకేతికత లభించడంతో పాటు అభివృద్ధి సమయం కూడా తగ్గుతుంది. ఈ కారులో సాఫ్ట్‌ వేర్, ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ లు, యూజర్ ఎక్స్ పీరియెన్స్ లాంటి అనేక అంశాలను టాటా స్వయంగా అభివృద్ధి చేస్తోంది. భారత్, యూకే, చైనా దేశాలకు చెందిన ఇంజనీరింగ్ బృందాలు ఈ ప్రాజెక్ట్‌ పై కలిసి పని చేస్తున్నాయి.

అవిన్యా X బ్యాటరీ గురించి..

బ్యాటరీ విషయంలో కూడా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తొలి అవిన్యా మోడళ్లలో 65 kWh నుంచి 80 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ లు ఉండే అవకాశం ఉంది. దీని వల్ల మంచి డ్రైవింగ్ రేంజ్‌ తో పాటు అధిక పనితీరు కూడా లభించే అవకాశం ఉంది. భవిష్యత్తులో అవిన్యా శ్రేణిని మరింత విస్తరించనుంది. అవిన్యా X తర్వాత పెద్ద సైజు గల మూడు వరుసల సీట్లతో కూడిన ప్రీమియం ఎలక్ట్రిక్ SUVను కూడా తీసుకురావాలని కంపెనీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొత్త ఫ్రీలాండర్ ప్లాట్‌ ఫారమ్, అధునాతన బ్యాటరీ టెక్నాలజీ, గ్లోబల్ రేంజ్ అభివృద్ధితో అవిన్యా X, టాటా మోటార్స్ నుంచి రాబోయే అత్యంత కీలకమైన ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒకటిగా మారబోతోంది.

Advertisement

Read Also: ఎలక్ట్రిక్ To లగ్జరీ వరకు.. జూన్ 2026లో మార్కెట్ ను షేక్ చేయబోతున్న క్రేజీ SUVలు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×