E-Paper
Advertisement

Apple 2026 New Products: 2026 ఈవెంట్‌లో దుమ్మురేపనున్న ఆపిల్.. ఫోల్డెబుల్ ఐఫోన్, ఏఆర్ గ్లాసెస్, డోర్‌బెల్ ఇంకా

Apple 2026 New Products: 2026 ఈవెంట్‌లో దుమ్మురేపనున్న ఆపిల్.. ఫోల్డెబుల్ ఐఫోన్, ఏఆర్ గ్లాసెస్, డోర్‌బెల్ ఇంకా
Advertisement

Apple 2026 New Products| 2026లో ఆపిల్ సాధారణ అప్‌గ్రేడ్లకు పరిమితం కాకుండా పూర్తి కొత్త ప్రొడక్ట్ కేటగిరీల్లోకి అడుగుపెడుతోంది. స్మార్ట్ హోమ్, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ డివైస్‌లలో ఆపిల్ ఎంట్రీ చేయనుంది. ఇవి రోజువారీ టెక్నాలజీతో యూజర్లు ఎలా ఇంటరాక్ట్ చేస్తారో మార్చేసే అవకాశం ఉంది. 2026లో ఆపిల్ ఏ ఏ కొత్త ప్రొడక్ట్‌లు లాంచ్ చేయనుందో చూద్దాం.

డైలీ యూజర్ల కోసం తక్కువ ధర MacBook ల్యాప్‌టాప్

ఆపిల్ ఎంట్రీ-లెవల్ యూజర్ల కోసం కొత్త చౌకైన MacBook లాంచ్ చేయనుంది. ఈ ల్యాప్‌టాప్స్ MacBook Air కంటే తక్కువ ధర రేంజ్‌లో ఉంటాయి. 12.9 ఇంచ్ నుంచి 13 ఇంచ్ డిస్‌ప్లే సైజ్ ఉండవచ్చు. iPhone 16 Pro సిరీస్‌లోని A18 Pro చిప్‌సెట్ వేరియంట్ ఉపయోగిస్తారు. బేసిక్ మల్టీటాస్కింగ్ కోసం 8GB RAM ఇవ్వవచ్చు. USB-C పోర్ట్‌లు ఉంటాయి కానీ డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ పరిమితంగా ఉండవచ్చు. పర్‌ఫామెన్స్ పాత M1 MacBook మోడల్స్ స్థాయిలో ఉంటుంది. స్టూడెంట్స్, డైలీ ప్రొడక్టివిటీ యూజర్లకు ఇది బాగా సరిపోతుంది.

ఆపిల్ మొదటి ఫోల్డబుల్ ఐఫోన్

Advertisement

ఫోల్డబుల్ ఐఫోన్ 2026లో అత్యంత ఆసక్తికరమైన లాంచ్‌గా ఉంది. ఇది బుక్-స్టైల్ ఫోల్డబుల్ డిజైన్‌తో వస్తుంది. అంతర్గత డిస్‌ప్లే 7.7 ఇంచ్ సైజులో ఇమ్మర్సివ్ వ్యూయింగ్ ఇస్తుంది. బయటి డిస్‌ప్లే సుమారు 5.3 ఇంచ్ ఉండవచ్చు. శాంసంగ్ ఫోల్డబుల్ ఇన్నర్ డిస్‌ప్లే ప్యానెల్ సప్లై చేసే అవకాశం ఉంది. కనిపించే క్రీజ్‌ను గణనీయంగా తగ్గించడంపై ఆపిల్ దృష్టి పెట్టింది. కొన్ని లీక్స్ ప్రకారం.. Face ID తొలగించి పవర్ బటన్‌లో Touch ID పెట్టవచ్చు. ధరల గురించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఇది ఆపిల్ అత్యంత ఖరీదైన ఐఫోన్ అవుతుంది.

ఆపిల్ స్మార్ట్ హోమ్ హబ్

ఆపిల్ స్మార్ట్ హోమ్ హబ్ కేటగిరీలోకి ఎంటర్ అవుతోంది. దీని లాంచ్ ఆలస్యం కావడానికి Siri అప్‌గ్రేడ్స్, సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేషన్ సమస్యలే కారణం. 6 ఇంచ్ నుంచి 7 ఇంచ్ స్క్వేర్ డిస్‌ప్లే ఉంటుంది.
A18 చిప్‌సెట్‌తో స్మూత్ పనితీరు ఇస్తుంది. బిల్ట్-ఇన్ కెమెరా, స్పీకర్ సిస్టమ్ ఉంటాయి. స్మార్ట్ హోమ్ యాక్సెసరీస్‌ను సులభంగా కంట్రోల్ చేస్తుంది. FaceTime కాల్స్, హోమ్ సెక్యూరిటీ మానిటరింగ్ సపోర్ట్ చేస్తుంది. వాల్ మౌంటింగ్ లేదా స్పీకర్ బేస్ ప్లేస్‌మెంట్ ఆప్షన్లు ఉంటాయి.

Face IDతో స్మార్ట్ డోర్‌బెల్

Advertisement

ఆపిల్ Face ID టెక్నాలజీతో స్మార్ట్ డోర్‌బెల్ డెవలప్ చేస్తోంది. ఇది కంపాటిబుల్ స్మార్ట్ లాక్‌లతో వైర్‌లెస్‌గా కనెక్ట్ అవుతుంది. యూజర్లకు సురక్షిత యాక్సెస్ ఇస్తుంది. ప్రస్తుతం ఎర్లీ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. 2026లో లాంచ్ అవుతుంది లేదా ముందుగానే టీజ్ చేయవచ్చు. సెక్యూరిటీ, ప్రైవసీపై బలంగా దృష్టి పెట్టారు. ఎన్‌క్రిప్టెడ్ వీడియో స్టోరేజ్, సెక్యూర్ ఎన్‌క్లేవ్ టెక్నాలజీ ఉంటాయి.

Also Read:  ఏఐ వల్ల ఒక్క రోజులో రూ.72 లక్షలు సంపాదించిన ఉద్యోగి.. ఎలాన్ మస్క్ ఫిదా

ఆపిల్ AR స్మార్ట్ గ్లాసెస్

ఆపిల్ AR స్మార్ట్ గ్లాసెస్ లీక్స్‌లో చాలా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది చివరికి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కన్స్యూమర్ అందుబాటు తర్వాతే ఉండవచ్చు. బిల్ట్-ఇన్ స్పీకర్లు ఆడియో అవుట్‌పుట్ ఇస్తాయి. కెమెరాతో విజువల్ రికగ్నిషన్ ఫీచర్లు ఉంటాయి. వాయిస్ కంట్రోల్స్‌తో హ్యాండ్స్-ఫ్రీ ఇంటరాక్షన్ సాధ్యమవుతుంది. బేసిక్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కూడా ఉండవచ్చు. మొదటి వెర్షన్‌లో ఇన్-లెన్స్ డిస్‌ప్లే ఉండకపోవచ్చు.

2026 యాపిల్ ప్లాన్స్ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ హోమ్, AR డివైస్‌లలో పెద్ద విస్తరణ చూపిస్తున్నాయి. ఈ ప్రొడక్ట్‌లు యాపిల్ ఎకోసిస్టమ్‌ను మరింత బలపరుస్తాయి. రోజువారీ టెక్నాలజీ ఉపయోగంలో కొత్త మార్పులు తీసుకొస్తాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×