E-Paper
Advertisement

Phone Tapping Case: క్లైమాక్స్‌కి ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణ కేసీఆర్ వరకు చేరిందా? రేపు ఎవరు?

Phone Tapping Case: క్లైమాక్స్‌కి  ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణ కేసీఆర్ వరకు చేరిందా? రేపు ఎవరు?
Advertisement

Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ క్లయిమాక్స్‌కు చేరిందా? మాజీలు, అధికారులు విచారణ ముగియడంతో ఇక రాజకీయ నేతల వంతైందా? ఇప్పటికే హరీష్‌రావు సిట్ ముందు హాజరుకాగా, ఇవాళ కేటీఆర్ వంతైంది? రేపో మాపో కేసీఆర్ వరకు వంతు కానుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

క్లయిమాక్స్‌కి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు

Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం బీఆర్ఎస్ పార్టీని కుదిపిస్తోంది. ఈ కేసు సిట్ చేతికి వెళ్లిన తర్వాత దర్యాప్తు వేగవంతమైంది. మాజీ అధికారులు, ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను  సిట్  విచారించింది. సేకరించిన సమాచారం ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తోంది. తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావును అధికారులు విచారించారు. ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్‌రావు వంతైంది.

పార్టీలో నెంబర్ గా ముద్రపడిన కేటీఆర్ వంతైంది. శుక్రవారం 11 గంటలకు ఆయన సిట్ ముందుకు హాజరవుతున్నారు.  ఆయన తర్వాత ఈ వ్యవహారం నేరుగా పెద్దాయనను తాకనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వరుసగా బీఆర్ఎస్ నేతలు విచారణకు వెళ్లడంతో ఆ పార్టీ నేతలు, కేడర్‌లో ఆందోళన మొదలైంది.

Advertisement

పెద్దాయన విచారణ కోసం ఎదురుచూస్తూ అంటూ ట్వీట్

దీంతో పార్టీ భవిష్యత్ ఏంటి? కీలక నేతలపై కేసులు నమోదైతే పార్టీ భవిష్యత్ ఏంటి? అంటూ కీలక నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పార్టీ తమను ఆదుకుంటుందా? అంటూ సన్నిహితులతో చర్చించడం కనిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు.

సిట్ విచారణ సమయంలో లోపల ఏం జరుగుతుంది? బయట బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తారు? సీన్ టు సీన్ పేరిట నాలుగు లైన్లు రాసుకొచ్చారు. చివరగా ‘‘తెలంగాణ ఇన్నర్ ఫీలింగ్ అంటూ లోపల ఏం జరుగుతుందో మాకు తెలుసు లే’’ అని రాసుకొచ్చారు. ‘ఫోన్ ట్యాపింగ్ బాధితులు, కవిత తోపాటు పాపం పండింది. పెద్దాయన విచారణ కోసం ఎదురుచూస్తూ’ అంటూ ఆయన చేసిన ట్వీట్ తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ALSO READ: హైకోర్టు ఆదేశాలు.. గీతం వర్సిటీ ఉక్కిరిబిక్కిరి! మేటరేంటి?

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×