E-Paper
Advertisement

Apple – Google: ఏఐ కోసం చేతులు కలిపిన యాపిల్, గూగుల్.. గుత్తాదిపత్యమేనని ఎలాన్ మస్క్ ఆందోళన!

Apple – Google: ఏఐ కోసం చేతులు కలిపిన యాపిల్, గూగుల్.. గుత్తాదిపత్యమేనని ఎలాన్ మస్క్ ఆందోళన!
Advertisement

Apple – Google: ప్రపంచాన్ని శాసిస్తున్న రెండు అమెరికా టెక్ దిగ్గజాలు యాపిల్, గూగుల్.. కృత్రిమ మేధ(AI) కోసం జతకట్టాయి. గూగుల్ ఏఐ జెమినైను యాపిల్ సిరి వాయిస్ అసిస్టెంట్‌తో అనుసంధానించి.. మరింత మెరుగైన అనుభవాన్ని యూజర్లకు పంచేందుకు ఈ రెండు కంపెనీల మధ్య కీలక ఒప్పందం జరిగింది. దీని తర్వాత గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ షేర్లు ఒక్కసారిగా రికార్డు స్థాయిలో పెరిగి, ప్రపంచంలోనే రెండో విలువైన కంపెనీగా అవతరించింది.

Siri వాయిస్‌లో జెమినై అనుసంధానం..

గూగుల్ ఆధునిక కృత్రిమ మేధ ఏఐ మోడల్ జెమినైను తదుపరి తరం సిరి వాయిస్ అసిస్టెంట్‌తో అనుసంధానించారని యాపిల్ సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది విడుదల చేయనున్న సిరి వాయిస్ అసిస్టెంట్‌లో జెమినై అనుసంధానం కానుంది. ఈ ఒప్పందం ప్రకారం తమ ప్రాథమిక ఏఐ సిస్టమ్స్‌ను జెమినైతో శక్తిమంతం చేయాలని యాపిల్ నిర్ణయం తీసుకుంది.అలాగే గూగుల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలను సైతం యాపిల్ ఉపయోగించుకోనుంది.

Advertisement

Read Also: పండగ ఆఫర్ అంటే ఇదేనేమో బాసూ.. ఐఫోన్ 17 కొనాలనుకుంటున్న వారికి గోల్డెన్ ఛాన్స్!

బిలియన్ డాలర్లు చెల్లించనున్న యాపిల్:

చరిత్రాత్మకమైన ఈ కీలక ఒప్పందానికి సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందంలో ఆర్థిక లావాదేవీలకు, సాంకేతిక అంశాలను వెల్లడించలేదు. పోర్బ్స్ సహా ఇతర సంస్థల అంచనాల ప్రకారం.. జెమినై ఏఐ క్లౌడ్‌ను ఉపయోగించుకోనున్న యాపిల్ గూగుల్‌‌కు బిలియన్ డాలర్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంతో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు తాజాగా కీలక మైలురాళ్లను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్ఫాబెట్ విలువ తొలిసారిగా 4 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. తద్వారా యాపిల్‌ను అధిగమించి ప్రపంచలోనే రెండో విలువైన కంపెనీగా ఆల్ఫాబెట్ అవతరించింది.

నాలుగో స్థానంలో గూగుల్ మాతృసంస్థ..

Advertisement

ప్రస్తుతం ఎన్విడియా తర్వాతి స్థానంలో గూగుల్ మాతృసంస్థ నిలిచింది. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, యాపిల్ తర్వాత 4 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అందుకున్న నాలుగో సంస్థగానూ ఆల్ఫాబెట్‌ అవతరించింది. ఇటీవల కొద్ది నెలల్లో ఆల్ఫాబెట్ చెప్పుకోదగ్గ వృద్ధిని నమోదు చేసింది. ఆ సంస్థ షేర్లు 2025లో ఏకంగా 6 శాతం వరకూ పెరిగాయి. తద్వారా అమెజాన్, మెటా, టెస్లా వంటి అద్భుతంగా రాణిస్తున్న ఏడు కంపెనీల్లో ఒకటిగా ఆల్ఫాబెట్ గుర్తింపు సాధించింది. తాజాగా యాపిల్, గూగుల్ మధ్య కుదిరిన జెమినై ఏఐ అనుసంధాన ఒప్పందం కొన్నేళ్లపాటు కొనసాగనుంది.

శాంసంగ్‌కు చేదువార్తే..

జెమినై అనుసంధానంతో యాపిల్ యూజర్లకు సిరీ వాయిస్ అసిస్టెంట్ వ్యక్తిగతంగా, మరింత ఆధునికంగా, ఉపయుక్తంగా మారనుందని అంచనా వేస్తున్నారు. ఒప్పందాన్ని ధృవీకరించిన గూగుల్ యాపిల్ యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జెమినై ఏఐ అనుసంధానం ఉంటుందని స్పష్టం చేసింది. అంటే యాపిల్ డేటాను గూగుల్‌కు ఇవ్వకుండానే ఒప్పందం అమలు జరుగుతుంది. అదే సమయంలో ఈ ఒప్పందం యాపిల్ ప్రత్యర్థి శాంసంగ్‌కు చేదువార్తేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు శాంసంగ్‌పై స్పష్టమైన ప్రభావం చూపకున్నా.. దీర్ఘకాలంలో గట్టిపోటీ ఖాయమని భావిస్తున్నారు. తమ ఏఐ భవిష్యత్తు గూగుల్ జెమినైతో విడదీయలేనంతగా అనుబంధమై ఉందని ఇటీవల శాంసంగ్ ప్రకటించింది. అయితే ఈ విషయంలో ప్రైవసీకి సంబంధించి గూగుల్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు.

తీవ్ర నిరాశలో ఎలాన్ మస్క్..

మరోవైపు యాపిల్-గూగుల్ డీల్‌పై ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ రంగంలో గూగుల్‌కు గుత్తాధిపత్యం లభిస్తుందని ఎక్స్ వేదికగా విమర్శించారు. గూగుల్ ఇప్పటికే ఆండ్రాయిడ్, క్రోమ్ ద్వారా టెక్నాలజీ రంగాన్ని నియంత్రిస్తోందన్న ఆయన తాజా ఒప్పందం వల్ల మరింత గుత్తాధిపత్యం సంక్రమిస్తుందన్నారు. యాపిల్, గూగుల్ ఒప్పందం ఒక రకంగా ఎలాన్ మస్క్‌కు చెందిన గ్రోక్‌కు కూడా ఎదురుదెబ్బగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గతంలోనూ విమర్శలు..

యాపిల్ సంస్థ గతంలో OpenAIతో జట్టుకట్టినప్పుడు కూడా మస్క్ ఇదేతరహా ఆందోళన వ్యక్తం చేశారు. సిరి ఇతర యాపిల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌లో ChatGPTని ఆప్షనల్ ఫీచర్‌గా ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. యాపిల్ విధానాలు ప్రత్యర్థుల ఎదుగుదలకు అవరోధంగా మారుతున్నాయంటూ దావా కూడా వేశారు. ప్రాథమికంగా తిరస్కరణకు గురైన ఆ దావా కోర్టుల్లో ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

Read Also: మొబైల్‌తో పాటు ల్యాప్‌టాప్‌కూ ఫాస్ట్ ఛార్జ్.. 65W అప్డేటెడ్ పవర్ బ్యాంక్ ప్రత్యేకతలు ఇవే!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×