E-Paper
Advertisement

Kishan Reddy: తెలంగాణ పల్లెలకు శుభవార్త.. రూ. 11 వేల కోట్లు విడుదల చేసిన కేంద్రం

Kishan Reddy: తెలంగాణ పల్లెలకు శుభవార్త.. రూ. 11 వేల కోట్లు విడుదల చేసిన కేంద్రం
Advertisement

Kishan Reddy: తెలంగాణలోని స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేయడంపై కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్రం స్థానిక సంస్థల కోసం రూ. 11 వేల కోట్లకు పైగా నిధులను మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. గతంతో పోలిస్తే ఈసారి కేంద్రం నుంచి అందుతున్న నిధులు 80 శాతం పెరగడం విశేషమని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికేట్లు (UCs) సమర్పించిన వెంటనే మిగిలిన నిధులను కూడా విడుదల చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోవడంలో జాప్యం చేయకూడదని ఆయన సూచించారు.

Advertisement

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంది, ఇకనైనా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి కనీస వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీలకు నేరుగా నిధులు అందుతున్న తరుణంలో, వాటిని మళ్లించకుండా గ్రామ వికాసానికి ఖర్చు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Read Also: జర్నలిస్టుల అరెస్టులపై సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు.. తప్పు చేయకపోతే బ్యాంకాక్ పారిపోవడం ఎందుకు? 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×