E-Paper
Advertisement

Yellamma Glimpse: ఎల్లమ్మ తాజా పోస్టర్ విడుదల..మిస్టరీకి తెరలేపే ఫస్ట్ గ్లింప్స్..!

Yellamma Glimpse: ఎల్లమ్మ తాజా పోస్టర్ విడుదల..మిస్టరీకి తెరలేపే ఫస్ట్ గ్లింప్స్..!
Advertisement

Yellamma Glimpse: ఈరోజు విడుదలైన కొత్త పోస్టర్‌తో ఎల్లమ్మ సినిమా మళ్లీ వార్తల్లో నిలిచింది. బలగం వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత దర్శకుడు వేణు యెల్దండి ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. అప్పట్లో ఈ సినిమాను నాని హీరోగా ప్రకటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం వచ్చింది.

నాని తర్వాత హీరోగా నితిన్ పేరు ఖరారైనట్టు వార్తలు వచ్చాయి. దీంతో సినిమా మళ్లీ ట్రాక్‌లో పడిందని అందరూ భావించారు. అయితే అనుకోకుండా నితిన్ కూడా ఈ సినిమా నుంచి బయటకు వచ్చాడన్న వార్తలు షాక్ ఇచ్చాయి. దీనికి సంబంధించిన స్పష్టమైన కారణాలు బయటకు రాలేదు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, రూమర్లు వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమాకు హీరో ఎవరు? సినిమా జరుగుతోందా లేదా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో పెరిగాయి. ఇక ఫైనల్ గా ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ హీరోగా ఖరారు అయ్యారు.

ఎల్లమ్మ సినిమా అప్డేట్..

Advertisement

ఈ నేపథ్యంలోనే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఎల్లమ్మ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను జనవరి 15వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ గ్లింప్స్ ద్వారా సినిమా కథ, టోన్, అలాగే ఈ ప్రాజెక్ట్ నిజంగా ఏ దశలో ఉందో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ పోస్టర్లో ఒక డోలు..

ఎల్లమ్మ గా కీర్తి సురేష్?

మొదటి నుంచే ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ పేరు బలంగా వినిపించింది. కానీ ఆమె స్వయంగా ఈ సినిమాలో నటించడం లేదని చెప్పడంతో ఆ వార్తలకు చెక్ పడింది. ప్రస్తుతం హీరో, హీరోయిన్ ఎంపికపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. గ్లింప్స్ విడుదల తర్వాత ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

డిల్ రాజు, శిరీష్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బలగం తర్వాత వేణు యెల్దండి నుంచి మరో బలమైన కథ వస్తుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అందుకే ఎన్ని మార్పులు వచ్చినా ఎల్లమ్మపై ఆసక్తి తగ్గలేదు. జనవరి 15న విడుదలయ్యే గ్లింప్స్ ఈ సినిమాపై ఉన్న అనుమానాలకు సమాధానం చెప్పుతుందా లేదా అన్నది చూడాలి.

Also Read: Mega Family Sankranti : మెగా ఇంట సంక్రాంతి సంబరాలు… ఒకేచోట మెగా హీరోల సందడి!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×