E-Paper
Advertisement

iPhone 17e: ఐఫోన్ బడ్జెట్ మోడల్ ఇండియాలో లాంచ్.. 48MP కెమెరా, A19 చిప్‌తో ధర ఎంతంటే

iPhone 17e: ఐఫోన్ బడ్జెట్ మోడల్ ఇండియాలో లాంచ్.. 48MP కెమెరా, A19 చిప్‌తో ధర ఎంతంటే
Advertisement

iPhone 17e Launch| ఆపిల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్‌లో బడ్జెట్ మోడల్ వచ్చేసింది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ.. ఐఫోన్ 17e విడుదల చేసింది. గత ఏడాది దాదాపు ఇదే సమయంలో iPhone 16e లాంచ్ అయింది. ఐఫోన్ 17e దానికి అప్‌గ్రేడ్ వెర్షన్. ఆపిల్ 17 లైనప్‌లో ఈ ఫోన్ అతి తక్కువ ధర మోడల్. కొత్త A19 చిప్‌తో పాటు మ్యాగ్ సేఫ్ (MagSafe) ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

iPhone 17e ధర, లభ్యత

iPhone 17e రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.64,900. 8GB RAM + 512GB వేరియంట్ ధర రూ.84,900. వైట్, పింక్, బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో వస్తుంది. ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్చి 11 నుంచి సేల్స్ మొదలవుతాయి. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, అధికారిక స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

డిస్‌ప్లే, డిజైన్

Advertisement

iPhone 17eలో 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1170*2532 పిక్సెల్స్. 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 800 నిట్స్ వరకు ఉంటుంది. సెరామిక్ షీల్డ్ టెక్నాలజీతో డిస్‌ప్లే ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్ కొలతలు.. 146.7*71.5* 7.8 mm, బరువు సుమారు 169 గ్రాములు. చేతిలో పట్టుకుంటే తేలికగా, లైట్‌గా అనిపిస్తుంది.

పర్‌ఫామెన్స్ సాఫ్ట్‌వేర్

కొత్త A19 చిప్‌తో ఫాస్ట్ పర్‌ఫామెన్స్, మెరుగైన ఎఫిషియెన్సీ ఇస్తుంది. iOS 26తో రన్ అవుతుంది. యాక్షన్ బటన్ ఉంది, దీంతో క్విక్ ఫీచర్లు యాక్సెస్ చేయవచ్చు. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు సపోర్ట్ చేస్తుంది. కొత్త C1X మోడెమ్‌తో నెట్‌వర్క్ స్పీడ్స్ మెరుగవుతాయి.

కెమెరా ఫీచర్లు

Advertisement

ఫోన్ వెనక భాగంలో 48MP కెమెరా ఉంది. ఇందులో f/1.6 అపర్చర్‌ ఉంది. వస్తుంది. ఆప్టికల్ క్వాలిటీ 2x జూమ్ సపోర్ట్ చేస్తుంది. ముందు 12MP ట్రూడెప్త్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ స్పష్టంగా వస్తాయి.

బ్యాటరీ, ఛార్జింగ్

ఐఫోన్ 17e బ్యాటరీ కెపాసిటీ వివరాల గురించి ఆపిల్ అధికారికంగా వెల్లడించలేదు. కానీ 26 గంటల వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని చెప్పింది. 20W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మ్యాగ్‌సేఫ్ ఫీచర్ సపోర్ట్ ఈ ఫోన్ హైలైట్.

Also Read: టెక్ రంగంలో గేమ్ ఛేంజర్ .. పేకముక్క లాంటి సన్నని బ్యాటరీ.. భారీ కెపాసిటీ

కనెక్టివిటీ, సెన్సార్లు

4G, 5G కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. Wi-Fi, బ్లూటూత్ సపోర్ట్ ఉన్నాయి. NFC, GPS, బైడౌ సపోర్ట్ కూడా ఉంది. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, బ్యారోమీటర్ వంటి సెన్సార్లు ఉన్నాయి.

ప్రీమియం ఆపిల్ పర్‌ఫామెన్స్ iPhone 17e తక్కువ ధరలో ఇస్తోంది. 48MP కెమెరా, A19 చిప్, MagSafe ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాలెన్స్‌డ్ ఫీచర్లు కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×