E-Paper
Advertisement

రూ.15వేల లోపు ది బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు.. ఆఫర్లు చూస్తే షాక్ అవుతారు!

రూ.15వేల లోపు ది బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు.. ఆఫర్లు చూస్తే షాక్ అవుతారు!
Advertisement

Amazon Prime Day 2026 Mobile Deals:  కొత్త ఫోన్ కొనాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారా ? మీ బడ్జెట్ రూ. 15వేలలోపే ఉందా ? అయితే.. మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. మోస్ట్ అవైటెడ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేసింది. జులైలో జరుగుతున్న ఈ బిగ్గెస్ట్ సేల్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై కంపెనీలు ఊహించని రేంజ్‌లో ప్రైస్ కట్స్ ప్రకటించాయి. శామ్‌సంగ్, రెడ్‌మి, రియల్‌మి, ఐకూ లాంటి బ్రాండ్స్ నుంచి ఈ ప్రైస్ రేంజ్‌లో లభిస్తున్న బెస్ట్ డీల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ. 15వేలలోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్:

మార్కెట్లో రూ.15 వేల లోపు బడ్జెట్‌లో కూడా జనాలు 5జీ కనెక్టివిటీ, మంచి డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్‌ని కోరుకుంటున్నారు. కస్టమర్ల పల్స్ పట్టుకుని అమెజాన్ ఈ సేల్‌లో లైవ్ చేసిన టాప్ ఫోన్లు ఇవే..

1.iQOO Z9 Lite 5G (పవర్‌ఫుల్ గేమింగ్ & పర్ఫార్మెన్స్):

Advertisement

తక్కువ ధరలో లాగ్ లేకుండా గేమింగ్ ఆడాలన్నా, ఫోన్ స్పీడ్‌గా పని చేయాలన్నా.. ఐకూ బ్రాండ్‌కి తిరుగులేదు.

సేల్ ఆఫర్ ధర: రూ. 11,499 (బ్యాంక్ ఆఫర్లతో కలిపి).

Advertisement

హైలైట్ ఫీచర్స్: మీడియాటెక్ డైమెన్సిటీ పవర్‌ఫుల్ 5G ప్రాసెసర్, 50MP సోనీ కెమెరా, స్మూత్ 90Hz డిస్‌ప్లే.

2.Samsung Galaxy M15 5G (బిగ్ బ్యాటరీ కింగ్):

నమ్మకమైన బ్రాండ్, నో టెన్షన్ బ్యాటరీ లైఫ్ కావాలనుకునే.. వారికి శామ్‌సంగ్ గెలాక్సీ M-సిరీస్ ఎప్పుడూ బెస్ట్ ఛాయిస్.

సేల్ ఆఫర్ ధర: రూ. 12,499

హైలైట్ ఫీచర్స్: ఏకంగా 6000mAh భారీ బ్యాటరీ ఇందులో ఉంది. దీనికి తోడు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉండటం వల్ల మూవీస్ చూసేటప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది.

3.Redmi Note 15R/13 5G (ఆల్‌రౌండర్ బడ్జెట్ ఫోన్):

రెడ్‌మి నోట్ సిరీస్ అంటేనే బడ్జెట్ లవర్స్ కి బెస్ట్. ఈ సేల్‌లో ఈ ఫోన్‌పై క్రేజీ డిస్కౌంట్ ఇస్తున్నారు.

సేల్ ఆఫర్ ధర: రూ. 13,999

హైలైట్ ఫీచర్స్: సూపర్ స్లిమ్ డిజైన్, 108MP ప్రైమరీ కెమెరా, బాక్స్ లోనే ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఈ ప్రైస్ లో ఇది బెస్ట్ ఆప్షన్.

4. Realme Narzo 70x 5G (సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్):

లుక్ పరంగా ఐఫోన్ రేంజ్‌లో ప్రీమియంగా కనిపిస్తూ.. ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే.. దీని వైపు చూడొచ్చు.

సేల్ ఆఫర్ ధర: రూ. 11,999

హైలైట్ ఫీచర్స్: 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz అల్ట్రా స్మూత్ డిస్‌ప్లే. ఈ ప్రైస్ రేంజ్‌లో 120Hz స్క్రీన్ రావడం చాలా రేర్.

Also Read: రూ. 2000లోపు.. బెస్ట్ ఇయర్‌బడ్స్ కావాలా ? ఈ ఆఫర్లు మిస్సవ్వొద్దు

ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ?

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఫోన్ కొనేటప్పుడు ఈ కింది ఆఫర్లను అస్సలు వదలకండి.

బ్యాంక్ కార్డ్స్: SBI,ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు) నేరుగా లభిస్తుంది.

అమెజాన్ కూపన్లు: మొబైల్ పేజీలోనే ‘Apply Coupon’ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని టిక్ చేస్తే అదనంగా రూ. 500 నుండి రూ. 1,000 వరకు ధర తగ్గుతుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్: మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే.. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద అదనపు వాల్యూని పొందవచ్చు.

రూ. 15వేల బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్ కొనడానికి ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఒక గోల్డెన్ ఛాన్స్. అయితే గుర్తుంచుకోండి. ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్లకు మాత్రమే, స్టాక్స్ చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. కాబట్టి లేట్ చేయకుండా.. మీకు నచ్చిన మోడల్‌ని ఇప్పుడే కార్ట్‌లో యాడ్ చేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×