// // AI Fake Aadhaar Card| రియల్‌గా కనిపించే ఆధార్, పాన్ కార్డు ఒక్క నిమిషంలో రెడీ.. ఏఐతో ఫేక్ ఐడీల ప్రమాదం -->
E-Paper
Advertisement

AI Fake Aadhaar Card: రియల్‌గా కనిపించే ఆధార్, పాన్ కార్డు ఒక్క నిమిషంలో రెడీ.. ఏఐతో ఫేక్ ఐడీల ప్రమాదం

AI Fake Aadhaar Card: రియల్‌గా కనిపించే ఆధార్, పాన్ కార్డు ఒక్క నిమిషంలో రెడీ.. ఏఐతో ఫేక్ ఐడీల ప్రమాదం
Advertisement

AI Fake Aadhaar Card Pan Card | ఏఐ టెక్నాలజీ మానవాళికి ఒక వరం లాంటిదని.. సైన్స్ రంగంలో ఇది విప్లవమని అందరి భావన. కానీ ఏఐ వల్ల ప్రమాదాలున్నాయని వాదించే నిపుణులు కూడా ఉన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఉదాహరణని ఒక ఎక్స్ (ట్విట్టర్) యూజర్ పోస్ట్ చేశారు. అడ్వాన్స్ ఏఐ టూల్ తో ఫేక్ ఐడీలను ఒక్క నిమిషంలో తయారు చేసినట్లు ఆ యూజర్ల తెలిపాడు. ఆ పోస్ట్ చూసి ఇప్పుడు నెటిజన్లంతా ఇది చాలా ప్రమాదకరమని డిబేట్ చేస్తున్నారు.

నానో బనానా ప్రోతో ఫేక్ ఐడీలు తయారు

గూగుల్ కంపెనీ ఇటీవలే తయారు చేసిన నానో బనానా పెద్ద సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు దీనికి ప్రో వెర్షన్ కూడా విడుదల అయింది. ఈ గూగుల్ నానో బనానా ప్రో పెద్ద సమస్య తెచ్చి పెట్టింది. ఈ టూల్ చాలా రియలిస్టిక్ ఫోటోలు తయారు చేస్తుంది. కానీ కొందరు దీన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారు. ఇండియాలో పాన్ కార్డు, ఆధార్ కార్డు లాంటి ముఖ్యమైన గుర్తింపు కార్డులను ఫేక్‌గా తయారు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం అని అందరూ భయపడుతున్నారు.

భయటపెట్టిన ఎక్స్ యూజర్

Advertisement

ఎక్స్ (ట్విట్టర్)లో హర్వీన్ సింగ్ చడ్డా అనే యూజర్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. సోమవారం ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. “ఈ AI టూల్ చాలా అద్భుతం, కానీ ఇది చాలా ప్రమాదకరం కూడా” అని రాశాడు. ఆయన ఒక కల్పిత వ్యక్తి పేరుతో ఫేక్ పాన్ కార్డు, ఆధార్ కార్డు తయారు చేసి ఫోటోలు పోస్ట్ చేశాడు. అవి చూస్తే నిజమైన కార్డుల్లా ఉన్నాయి! పాత వెరిఫికేషన్ సిస్టమ్స్ ఇలాంటి ఫేక్ కార్డుల్ని గుర్తించలేవు. ఈ విషయమే అందరినీ భయపెడుతోంది.

సోషల్ మీడియాలో సెటైర్లు

హర్వీన్ సింగ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అయిపోయింది. వేల మంది కామెంట్స్ పెట్టారు. చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కొందరు ఈ విషయంపై సెటైర్లు వేశారు. ఒక యూజర్ ఇలా రాశాడు.. “అరె, థాంక్స్ బ్రో! నా డ్రైవింగ్ లైసెన్స్‌లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటా.” అని కామెడీగా కామెంట్లు పెట్టాడు. మరొకరైతే.. “ఆధార్ కార్డులో ఫోటో ఇంత క్లియర్‌గా ఉంటే అది ఫేక్ అని అర్థం, అసలు ఆధార్ కార్డు ఫోటోలు ఎప్పుడూ బ్లర్‌గానే ఉంటాయి కదా!” అని సెటైర్ వేశాడు.

Advertisement

కొందరు సీరియస్‌గా సలహాలు ఇచ్చారు. “ఇకపై ఆధార్ కార్డు ఒరిజినల్‌ లేదా ఫేక్ అని చూడాలంటే QR కోడ్ స్కాన్ చేయడమే మంచిది. ఇలా చేస్తే ఫేక్ కార్డుల్ని సులువుగా పట్టుకోవచ్చు.” అని ఒక యూజర్ రాశాడు.

ఈ కామెంట్స్ సరదా మాత్రమే కాదు, చాలా పెద్ద హెచ్చరిక కూడా. AI ఇంత పవర్‌ఫుల్ అయిపోతే ఎవడైనా ఫేక్ గుర్తింపు కార్డులు తయారు చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, లోన్ తీసుకోవడం, ఎన్నో మోసాలు చేయొచ్చు. ప్రభుత్వం త్వరగా కొత్త రూల్స్ తీసుకొచ్చి, గుర్తింపు పత్రాల వెరిఫికేషన్ మరింత గట్టిగా చేయాలి. కేవలం ఫోటో చూసి నమ్మే రోజులు పోయాయి.
ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ టాపిక్ మీదే చర్చ జరుగుతోంది. ఏఐ టెక్నాలజీ మనకు చాలా మేలు చేస్తుంది, కానీ దుర్వినియోగం చేస్తే భారీ నష్టం కూడా చేస్తుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి!

Also Read: ఐఫోన్ పోగొట్టుకున్నారా? లేదా చోరీ అయిందా? ఆపిల్ కొత్త ఐఫోన్ ఇస్తోంది.. వారికి మాత్రమే

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×