E-Paper
Advertisement

TVK Party: టీవీకే విజయ్ ‘బిగిల్’ జోష్.. పవన్ కల్యాణ్ పంథాలో సక్సెస్ సాధ్యమేనా?

TVK Party: టీవీకే విజయ్ ‘బిగిల్’ జోష్.. పవన్ కల్యాణ్ పంథాలో సక్సెస్ సాధ్యమేనా?
Advertisement

తమిళనాడు రాజకీయ రణక్షేత్రంలో సరికొత్త అంకం మొదలైంది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీకి ఎన్నికల సంఘం ‘విజిల్’ గుర్తును కేటాయించడంతో కేడర్‌లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ముఖ్యంగా విజయ్ కెరీర్‌లో సూపర్ హిట్ అయిన ‘బిగిల్’ సినిమా తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదలవ్వడం.. ఇప్పుడు అదే పేరు పార్టీ గుర్తుగా రావడం యాదృచ్ఛికమైనా, అది కార్యకర్తలకు భారీ బూస్ట్‌ని ఇస్తోంది.

‘విజిల్ పోడు’.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

గతంలో ఏపీ ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ‘గాజు గ్లాసు’ గుర్తు వచ్చినప్పుడు ఏ విధంగానైతే టీ గ్లాసులను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారో.. ఇప్పుడు తమిళనాడులో TVK కార్యకర్తలు అదే బాటలో నడుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలకు విజిల్స్ పంపిణీ చేస్తూ.. ‘విజిల్ పోడు’ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ గుర్తు సామాన్యులకు సులభంగా చేరువయ్యే అవకాశం ఉండటం పార్టీకి కలిసొచ్చే అంశం.

పవన్ కల్యాణ్ సక్సెస్ రిపీట్ అవుతుందా?

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ తన ఫ్యాన్ బేస్‌ను ఓట్లుగా మార్చుకుని.. కింగ్ మేకర్‌గా ఎదిగి డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. ఇప్పుడు విజయ్ విషయంలోనూ అదే చర్చ జరుగుతోంది. విజయ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాల్లోయింగ్ ఓట్ల రూపంలో మారుతుందా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే, అన్నాడీఎంకే (AIADMK) ఇప్పటికే విజయ్ పార్టీకి 70 సీట్లు, డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసినట్లు తమిళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

విజయ్ నిర్ణయం ఏంటి? కింగ్ మేకరా.. కింగా?

ఇప్పుడు విజయ్ ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి, అన్నాడీఎంకే ఆఫర్‌కు తలొగ్గి పొత్తుతో వెళ్లి డిప్యూటీ సీఎం పదవితో సంతృప్తి చెందడం. రెండు, పక్కాగా ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా ఒంటరి పోరుకు సిద్ధమవ్వడం. ఈ ఏడాది సమ్మర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు విజయ్ రాజకీయ భవిష్యత్తును తేల్చనున్నాయి. ఫ్యాన్ పవర్ అనేది కేవలం హంగామాకే పరిమితం కాకుండా, పోలింగ్ బూత్ వరకు వెళ్తేనే విజయ్ ‘విజిల్’ తమిళనాడులో గెలుపు రాగమై వినిపిస్తుంది. ఏది ఏమైనా, ‘విజిల్’ గుర్తు TVK పార్టీకి ఒక బలమైన బ్రాండ్‌గా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

ALSO READ: Harish Rao: నోటీసుల డ్రామాతో బొగ్గు స్కామ్ ఆపలేరు.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×