E-Paper
Advertisement

Apple Siri AI Bot: యాపిల్ సంచలన నిర్ణయం.. చాట్ జీపీటీకి దీటుగా కొత్త ఏఐ సిరి, ఐఫోన్ వాడకాన్ని పూర్తిగా మార్చేసే ఫీచర్లివే!

Apple Siri AI Bot: యాపిల్ సంచలన నిర్ణయం.. చాట్ జీపీటీకి దీటుగా కొత్త ఏఐ సిరి, ఐఫోన్ వాడకాన్ని పూర్తిగా మార్చేసే ఫీచర్లివే!
Advertisement

Apple Siri AI Bot: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ యూజర్ల కోసం త్వరలోనే కీలక అప్డేట్ అందుబాటులోకి రానుంది. ఐఫోన్ ద్వారా వాయిస్ అసిస్టెంట్‌గా సేవలందించిన ‘Siri’ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు యాపిల్ సిద్ధమవుతోంది. ఇప్పటివరకు కేవలం చిన్న చిన్న పనులకు మాత్రమే పరిమితమైన సిరిని.. ChatGPT వంటి అత్యుత్తమ AI Botలకు పోటీగా మార్చాలని కంపెనీ యోచిస్తోంది. దీనికోసం Google Gemini టెక్నాలజీని వాడుకోబోతున్నట్లు సమాచారం. ఈ మార్పుతో iPhone వాడకం మరో స్థాయికి చేరుకోనుందని చెప్పవచ్చు.

Siri సరికొత్త ప్రయాణం..

యాపిల్ అంతర్గతంగా ఒక భారీ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. దీని ప్రధాన ఉద్దేశం సిరిని కేవలం ఒక వాయిస్ కమాండ్ టూల్‌గా కాకుండా.. ఇంటెలిజెంట్ కన్వర్జేషనల్ పార్ట్‌నర్‌గా మార్చడం. ప్రస్తుతం మనం అలారాలు పెట్టడానికో లేదా మెసేజ్‌లు పంపడానికో సిరిని ఉపయోగిస్తున్నాం. కానీ భవిష్యత్తులో రాబోయే అప్‌డేట్‌తో సిరి మనతో సహజంగా మాట్లాడగలు. మనం అడిగే క్లిష్టమైన ప్రశ్నలను అర్థం చేసుకోవడమే కాకుండా.. సందర్భాన్ని బట్టి సమాధానాలు ఇస్తూ ఒక మనిషితో మాట్లాడుతున్న ఫీల్‌ను కలిగిస్తుంది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్, మాక్ ఓఎస్ వంటి అన్ని యాపిల్ డివైజ్‌లలో ఈ మార్పులు రానున్నాయి.

Advertisement

Also Read: ఇక గూగుల్ పే, ఫోన్ పేలకు చుక్కలే.. రంగంలోకి యాపిల్ పే, ట్యాప్ చేస్తే చాలు పేమెంట్ సక్సెస్!

మెయిల్స్ కూడా రాసేస్తుంది..

రాబోయే AI ఆధారిత Siri ముందులా కంటే.. చాలా తెలివైనదిగా మారబోతోంది. ఇది కేవలం సమాచారాన్ని వెతకడమే కాకుండా.. భాకీ రిపోర్టులను స్పష్టంగా వివరించడం, ఈ-మెయిల్స్ రాయడంలో మనకు సహాయపడుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది మన డివైజ్‌లోని వ్యక్తిగత డేటాను మరింత మెరుగ్గా అర్థం చేసుకుంటుంది. అంటే.. క్యాలెండర్ షెడ్యూల్స్, ఫొటోలు, ఫైల్స్‌ను లోతుగా విశ్లేషించడం వంటివి. అయితే, ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పకపోయినా మన అవసరాలను గుర్తించి పనులను చక్కబెడుతుంది.

పోటీని తట్టుకునేందుకే ఈ మార్పు..

Advertisement

టెక్ ప్రపంచంలో ప్రస్తుతం AI హవా నడుస్తోంది. శాంసంగ్ వంటి ఇతర దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ డివైజ్‌లలో అధునాతన AI ఫీచర్లను ప్రవేశపెట్టాయి. ChatGPT, Google Gemini వంటి టూల్స్ అందుబాటులోకి వచ్చాక Siri పనితీరు కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. అందుకే తమ వినియోగదారులను కోల్పోకుండా ఉండటానికి, మార్కెట్లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి యాపిల్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జెమిని వంటి శక్తివంతమైన మోడల్‌ను సిరిలో చేర్చడం ద్వారా యాపిల్ తన ఏఐ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది.

అందుబాటులోకి ఎప్పుడు?

ఈ కొత్త అప్‌డేట్‌కు సంబంధించి యాపిల్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి తేదీని ప్రకటించలేదు. అయితే త్వరలో జరగబోయే డెవలపర్స్ ఈవెంట్‌లో దీనిని ఆవిష్కరించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త ఐఫోన్ మోడల్స్ లాంచ్ అయ్యే సమయానికి ఈ అడ్వాన్స్‌డ్ సిరి అందరికీ అందుబాటులోకి రావొచ్చు. ఇదే గనుక నిజమైతే.. ఐఫోన్ వినియోగదారులకు వారి రోజువారీ పనుల్లో ఓ సూపర్ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ తోడుగా నిలవడం ఖాయం.

Also Read: రూ.12 కోట్లు.. 400 రత్నాలు.. వంతారా థీమ్‌తో అనంత్ అంబానీ కోసం అరుదైన వాచ్!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×