E-Paper
Advertisement

Horsley Hills : ఆంధ్రా ఊటీ.. హార్సిలీ హిల్స్

Horsley Hills : ఆంధ్రా ఊటీ.. హార్సిలీ హిల్స్
Advertisement
Horsley Hills

Horsley Hills : అక్కడి కొండలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుగా కనువిందు చేస్తుంటాయి. ఆస్వాదించడానికి ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం ఈ ‘హార్సిలీ హిల్స్’ ప్రత్యేకతలు. ఈ ప్రదేశం ఎక్కడో కాదండోయ్.. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. ఈ హిల్స్ సముద్ర మట్టానికి 1314 మీటర్ల ఎత్తులో ఉంటాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణానికి 29 కి.మీ దూరంలో ఉన్న ఈ అద్భుత ప్రదేశాన్ని ‘ఆంధ్రా ఊటీ’ అంటారు.

తూర్పు కనుమల్లో ఉన్న ఈ హార్సిలీ హిల్స్ సముద్ర మట్టానికి బాగా ఎత్తులో ఉండటం వల్ల.. వేసవి కాలంలో సైతం ఇక్కడ చల్లగా ఉంటుంది. అన్ని కాలాల్లో పర్యాటకానికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది. ఈ హిల్స్ పైకి వెళ్లే కొండ దారి.. రకరకాల మొక్కలతో, వన్యజీవులతో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ హిల్స్ నుంచి సూర్యోదయం, సూర్యాస్తమాలు పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తాయి.

Advertisement

హార్సిలీ హిల్స్‌ విహారానికి వచ్చే ప్రకృతి ప్రేమికుల కోసం.. ఇక్కడ నిర్వహించే ట్రెక్కింగ్, గాలిలో తాళ్ల వంతెనపై నడవటం వంటి ఎన్నో రకాల సాహస కృత్యాలు వినోదాన్ని పంచుతాయి. వీటితో పాటు దాదాపు 150 ఏళ్ల వయస్సు ఉన్న యూకలిప్టస్ చెట్టు ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రకృతి అందాలతో పాటు వినోదాన్ని కోరుకునేవారికి ఆంధ్రా ఊటీ.. హార్సిలీ హిల్స్ బెస్ట్ ఆప్షన్. మరెందుకు ఆలస్యం.. ఈ సుందర ప్రదేశాన్ని మీ మనసుకు నచ్చినవారితో చుట్టి రండి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×