E-Paper
Advertisement

Cigarette : పొగ సరే.. పీకల సంగతేమిటి?

Cigarette  : పొగ సరే.. పీకల సంగతేమిటి?
Advertisement
Cigarette

Cigarette : ఆనందానికి సిగరెట్టు.. ఆలోచనలను గిలగొట్టు.. అని అనుకుంటూ సిగరెట్టు మీద సిగరెట్టును కాల్చేసే వాళ్లను చూసే ఉంటారు. ఇలా గుప్పుగుప్పుమంటూ ఊదేస్తూ చివరకు సిగరెట్టు పీకలను విసిరేసేవారికి కొదవేం లేదు. ఆ పీకలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. బహుశా లండన్‌కు చెందిన పర్యావరణ స్వచ్ఛంద సంస్థ భావన కూడా అదే కావొచ్చు. అయితే ఆ సంస్థ సభ్యులు చిరాకుపడకుండా.. పొగరాయుళ్లకు కనువిప్పు కలిగించాలని నిశ్చయించారు.

సిగరెట్టు పీకలను ఎడాపెడా విసిరేయొద్దనే సందేశాన్ని వారికి ఇవ్వాలని తలపోశారు. అనుకున్నదే తడవు.. ఇదిగో ఇలా పీకల దిబ్బను అందంగా తీర్చిదిద్దారు. అదీ లండన్ థేమ్స్ నది ఒడ్డున ఉన్న కింగ్‌స్టన్ టౌన్ ప్రధాన వీధిలో! ఇంతకీ ఈ బృహత్తర ప్రయత్నం చేసింది కీప్ బ్రిటన్ టైడీ అనే సంస్థ.

Advertisement

బ్రిటన్ ప్రధాన వీధుల్లో రోజూ 2.7 మిలియన్ల పీకలను విసిరేస్తుంటారని ఆ సంస్థ చెబుతోంది. ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలిపింది. అలా వీధుల నుంచి సేకరించిన సిగరెట్టు పీకలను ఏరి తెచ్చి.. ఇలా శిల్పంలా చేశారు. ఇంగ్లండ్ లో చెత్తలో చేరే వస్తువుల్లో 66% సిగరెట్లేనని అంచనా.

ప్రతి 8 సిగరెట్లలో 7 సిగరెట్లను వీధుల్లోనే వెలిగిస్తారని ఆ సంస్థ తెలిపింది. అయితే తాగేయగా మిగిలిన పీకలను సరిగ్గా డిస్పోజ్ చేయడం లేదని, వాటిని వీధుల్లోనే గిరాటేస్తున్నారని సంస్థ సభ్యులు వాపోయారు. ఇలా చేయకుండా స్మోకర్లను చైతన్యపరిచేందుకే తామీ వినూత్న ప్రయత్నం చేశామని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీధుల్లో విసిరేసే సిగరెట్ పీకలు 12 బిలియన్లకు పైనే ఉంటాయట.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×