E-Paper
Advertisement

Kodali Nani | టీడీపీ కోసం సిగ్గు లేకుండా పురంధేశ్వరి.. చంద్రబాబు భలే నాటకాలు : కొడాలి నాని

Kodali Nani | ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ తెలుగుదేశం కోసం పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆమె సిగ్గులేకుండా తెలుగుదేశం పార్టీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నారని అన్నారు.

Kodali Nani | టీడీపీ కోసం సిగ్గు లేకుండా పురంధేశ్వరి.. చంద్రబాబు భలే నాటకాలు : కొడాలి నాని
Advertisement

Kodali Nani | ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ తెలుగుదేశం కోసం పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆమె సిగ్గులేకుండా తెలుగుదేశం పార్టీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నారని అన్నారు.

గుడివాడలో కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. “దివంగత ఎన్టీఆర్‌కి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తులలో పురంధేశ్వరీ కూడా ఒకరు. కన్నతండ్రికి నమ్మకం ద్రోహం చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి పురంధేశ్వరి ముఖ్యపాత్ర పోషించింది. ఆమె తన కన్న తండ్రికి వెన్నుపోటు పోడిచింది. ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి.. ఆయన మానసిక వేదనతో చనిపోయేలా చేసిన కూతురు ప్రపంచంలో ఏ తండ్రికి ఉండదు,” అని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement

తెలుగుదేశం పాలనలో భారీ స్థాయిలో ఇసుక దోపిడీ జరిగిందని కొడాలి నాని ఆరోపించారు. ఆ సమయంలో పురంధేశ్వరి కూడా తన తీసుకునేది అందుకే ఆమె నాడు విమర్శలు చేయలేదన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇసుక అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.4000కోట్లు ఆదాయం వచ్చిందని నాని స్పష్టం చేశారు. అదే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇసుకతో ఒక్కరూపాయి కూడా ఆదాయం రాలేదు అంటే వారంతా కలిసి అ డబ్బులు దోచుకోలేదా…? అని కొడాలి నాని నిలదీశారు. కానీ ఇప్పుడు పురంధేశ్వరి సిగ్గుశరం లేకుండా ఇసుక దోపిడీ జరిగిందని మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎలా పడితే అలా మాట్లాడితే.. వైసీపీ చూస్తూ ఊరుకొదని హెచ్చరించారు.

మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఆరోగ్యరీత్య బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుపై కూడా కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైలు నుంచి బయట ఉండటానికి గుండెకు బొక్క పడిందని చంద్రబాబు భలే నాటకాలు ఆడుతున్నాడు అని ఆరోపించారు. చంద్రబాబు దొరికిన దొంగ అని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ నాయకత్వంలో అవినీతిలేని సుపరిపాలన సాగుతోందని అని కొడాలి నాని చెప్పుకొచ్చారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×