E-Paper
Advertisement

True Crime Documentary OTT : తెలంగాణ అమ్మాయిల రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో… ప్రతీ ఒక్కరూ చూడాల్సిన డాక్యుమెంటరీ

True Crime Documentary OTT : తెలంగాణ అమ్మాయిల రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో… ప్రతీ ఒక్కరూ చూడాల్సిన డాక్యుమెంటరీ
Advertisement

True Crime Documentary OTT : రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో రూపొందే సిరీస్, డాక్యుమెంటరీలకు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. కానీ ఇప్పటిదాకా దేశాన్ని ఓ ఊపు ఊపిన స్టోరీలనే తెరపైకి తీసుకొచ్చారు మేకర్స్. ఫస్ట్ టైమ్ తెలంగాణ అమ్మాయిల రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో ఓ కొత్త డాక్యుమెంటరీని రూపొందించారు. ఇది ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. మరి ఈ డాక్యుమెంటరీ కథ ఏంటి ? స్పెషల్ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో

‘సైలెంట్ స్క్రీమ్స్: ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ’ (Silent Screams – The Lost Girls Of Telangana) టైటిల్ తో రూపొందిన ఈ డాక్యుమెంటరీని తెలంగాణలో చోటు చేసుకున్న కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. మిస్సైన మహిళలు, ఆ తరువాత ఆయా కేసుల గురించి బయటపడ్డ విస్తుపోయే నిజాలు, బాధితుల కుటుంబాల ఆవేదనను ఇందులో కళ్ళకు కట్టారు. అంతేకాకుండా మన చుట్టూ ఉండే ప్రమాదకరమైన పరిస్థితులపై అవగాహన పెంచేలా దీన్ని తెరకెక్కించారు. ఇక ఇది హైదరాబాద్‌ లో తెలుగులో తీసిన మొదటి ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీ. దీనికి అరవింద్ మీనన్ దర్శకత్వం వహించగా, శృతి హాసన్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఈ డాక్యుమెంటరీ జనవరి 8 నుండి సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇందులో ఉన్న తెలంగాణలో గత 10-15 సంవత్సరాలలో మిస్సైన మహిళలు, వాటి వెనుక దాగి ఉన్న వాస్తవాలను, సిస్టమ్ లోపాలను, సమాజ ఉదాసీనతను అంశాలు మనల్ని ఆలోచనలో పడేస్తాయి.

Advertisement

Read Also : మనుషుల్ని పురుగుల్లా చంపేసే స్పైడర్స్… ఒళ్లు జలదరించే సీన్స్ సామీ

మూడు కేసుల చుట్టూ స్టోరీ

ఇందులో మూడు కేసులను ప్రధానంగా ప్రస్తావించారు. ముందుగా హజీపూర్ కేస్. రాత్రిపూట ఇంటి నుంచే ఓ యువతి మిస్ అయ్యింది. పోలీసులు మొదట్లో ఈ కేసును పట్టించుకోలేదు. తరువాత ఇన్వెస్టిగేషన్ జరిగినా ఫలితం లేకుండా పోయింది. రెండవది వరంగల్ కేస్. ఒక కాలేజీ స్టూడెంట్ బస్ స్టాప్ దగ్గర నుస అయ్యింది. ఆమె ఫ్యామిలీ ఏళ్ల తరబడి పోరాడుతున్నా… ఈ కేసులో అమ్మాయి గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు. మూడవది యెల్లపటార్ కేస్. ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్ళిన అమ్మాయి తిరిగి రాలేదు.

Advertisement

ఈ మూడు కేసులతో పాటు తెలంగాణలో మహిళలు, బాలికలు అదృశ్యమవుతున్న ఇతర కేసులు, ట్రాఫికింగ్ నెట్‌వర్క్స్, ఫ్యామిలీ వివాదాలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోపాలు, సమాజంలోని భయం, మౌనం వంటి అంశాలను ఈ డాక్యుమెంటరీలో చూశాక మనసు నొచ్చుకుంటుంది. శృతి హాసన్ ఈ డాక్యుమెంటరీకి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఎమోషనల్ గా మరింత ఇంపాక్ట్ ఫుల్ గా అన్పిస్తుంది. కొన్ని సందర్భాలలో కోపం కూడా కట్టలు తెంచుకుంటుంది. ఇక డాక్యుమెంటరీలో రియల్ ఫుటేజ్, ఇంటర్వ్యూలు, ఫ్యామిలీ సభ్యుల మాటలు, పోలీస్ రికార్డులు, లొకల్ రిపోర్టర్ల సమాచారం వంటివన్నీ వాడారు. టైమ్ ఉంటే తప్పకుండా ఈ డాక్యుమెంటరీపై ఒక లుక్కేయండి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×