E-Paper
Advertisement

మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. టెంపుల్స్‌లో వీఐపీ దర్శనాలెందుకు? దేవుడి ముందు అందరూ సమానమే

మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. టెంపుల్స్‌లో వీఐపీ దర్శనాలెందుకు? దేవుడి ముందు అందరూ సమానమే
Advertisement

Madras High Court: దేవాలయాల్లో వీఐపీ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుని ముందు అందరూ సమానుమే, వీఐపీల కోసం ఆలయాలలో ప్రత్యేక దర్శనాలు ఎందుకని ప్రశ్నించింది. భక్తులను వేచి ఉండేలా చేయకూడదని వ్యాఖ్యనించింది. ఈ కేసు విషయమై మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగింది?

మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Advertisement

విశ్వ హిందూ పరిషత్ ఉత్తర తమిళనాడు విభాగం అధ్యక్షుడు చొక్కలింగం వీఐపీ దర్శనాల అంశంపై మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ స్వామినాథన్, జస్టిస్ లక్ష్మీనారాయణన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

వృద్ధులు, వికలాంగులు, గర్భిణిలు, కొత్తగా వివాహం చేసుకున్న జంటలు, రాష్ట్రపతి, రాజ్యాంగబద్ధ హోదా కలిగిన వారికి మినహాయింపు ఇవ్వవచ్చని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేవుడి ముందు అందరూ సమానమేనని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా దేవాలయాల్లోకి వెళ్లి ప్రత్యేక దర్శనాలు చేసుకోవడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. వీఐపీల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉండాలా?

Advertisement

టెంపుల్స్‌లో వీఐపీ దర్శనాలెందుకు? దేవుడి ముందు అందరూ సమానమే

ఈనెల 15న తిరుపరంకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయంలో మంత్రి దర్శనం కోసం ఆలయ సమయాన్ని పొడిగించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో వివరణ కోరింది న్యాయస్థానం. ఆలయ సమయాన్ని పొడిగించ లేదని తమిళనాడు ప్రభుత్వం నివేదిక ఇచ్చిన విషయం తెల్సిందే.

పూర్తిగా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరగా, ఆరువారాల సమయం ఇచ్చింది న్యాయస్థానం. ఈ కేసుపై విచారణ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. సనాతన ధర్మం అనేది ధనికుడు-పేదవాడు అనే భేదాన్ని చూపదని పేర్కొంది పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. అందర్ని సమానంగా చూస్తుందన్నారు. డబ్బు తీసుకుని ప్రత్యేక దర్శనాలు కల్పించడం హిందూ శాస్త్రాల్లో ఎక్కడా లేదన్నారు.

ALSO READ: శనివారం కర్ణాటక సీఎల్పీ సమావేశం.. డీకేను ఎన్నుకోవడం లాంఛనమే, మాజీ సీఎం సిద్దరాయమ్య కోసం 

భక్తుల నుంచి డబ్బులు దోచుకోవడమేనని పేర్కొన్నారు. ద్రావిడ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వీఐపీ కల్చర్ బాగా పెరిగిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19,21,25లకు విరుద్ధమన్నది పిటిషనర్ వాదన. ఆలయాల నిర్వహణ కోసం ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నామని ఆ శాఖ చెబుతోంది. ఈ పద్ధతి సనాతన ధర్మానికి విరుద్ధమని వాదించారు.

ఆ శాఖ తన నియంత్రణలో ఉన్న ఆలయాల ద్వారా రాజ్యాంగానికి విరుద్ధమైన వివక్షను పాటిస్తోందన్నారు. అలాంటి పద్ధతులు రద్దు చేయడానికి ప్రయత్నించాలని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ శాఖ నియంత్రణలో ఉన్న అన్ని దేవాలయాలలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రతి దేవాలయంలో ఒక వీల్ చైర్ ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ ఇంకా వాదోవాదనలు జరుగుతున్నాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×