E-Paper
Advertisement

సీఎం విజయ్ రూట్ మార్చారుగా.. బ్లాక్ సూట్ టు పట్టుపంచె! ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న విజువల్స్!

సీఎం విజయ్ రూట్ మార్చారుగా.. బ్లాక్ సూట్ టు పట్టుపంచె! ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న విజువల్స్!
Advertisement

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తున్న ముఖ్యమంత్రి విజయ్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 2025లో తన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తరపున భారీ బహిరంగ సభ పెట్టి, ఆపై 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హిస్టారికల్ విక్టరీని అందుకొని సీఎం పీఠాన్ని ఎక్కిన విజయ్ ఇపుడు ఏం చేసినా ట్రెండే. సాధారణంగా తమిళ రాజకీయాల్లో ముఖ్యమంత్రులు అనగానే మనకు తెల్లటి కాటన్ షర్ట్, పంచె మాత్రమే గుర్తొస్తాయి.కానీ, విజయ్ సీఎం అయ్యాక ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ప్రమాణ స్వీకారం రోజు నుంచి మొన్నటి అసెంబ్లీ సమావేశాల వరకు ఆయన ఎప్పుడూ పర్‌ఫెక్ట్ బ్లాక్ కలర్ సూట్‌లోనే కనిపిస్తూ స్టైలిష్ సీఎం అనిపించుకున్నారు. అయితే, తాజాగా ఆయన తన సిగ్నేచర్ బ్లాక్ సూట్ లుక్‌ని పక్కన పెట్టి, అచ్చమైన తమిళ తంబిలా పట్టుపంచెలో మెరిసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు.


ఈ లుక్ మార్పు వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. విజయ్ దగ్గర గత 15 ఏళ్లకు పైగా పీఏగా, మేనేజర్‌గా నమ్మకంగా పనిచేస్తున్న జగదీష్ పళనిసామి చెన్నైలో ఒక విలాసవంతమైన కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం జరిగిన గృహప్రవేశ వేడుకకు సీఎం విజయ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మేనేజర్ జగదీష్‌తో విజయ్‌కు ఉన్న అనుబంధం కేవలం ప్రొఫెషనల్ మాత్రమే కాదు, అంతకు మించి.విజయ్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమాలు ‘మాస్టర్’ (2021), ‘బీస్ట్’ (2022), ‘లియో’ (2023) వంటి చిత్రాలకు జగదీష్ కో-ప్రొడ్యూసర్‌గా, లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. విజయ్ చివరి చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT), అలాగే ఆయన రాజకీయాల్లోకి రాకముందు ప్రకటించిన 69వ సినిమా షూటింగ్స్ సమయంలోనూ జగదీష్ తోడుగా  ఉన్నారు. అందుకే, తన నమ్మకస్తుడైన మేనేజర్ ఇంట్లో జరిగే శుభకార్యం కోసం సీఎం విజయ్ తన ప్రోటోకాల్స్, బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి అటెండ్ అయ్యారు.
సాంప్రదాయ పట్టుపంచెతో వింటేజ్ లుక్‌లో ఎంట్రీ
ఈ వేడుకలో విజయ్ గోల్డెన్ కలర్ పట్టు చొక్కా, సాంప్రదాయ పట్టుపంచె కట్టుకుని వింటేజ్ లుక్‌లో ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. రాజకీయాల్లోకి వచ్చాక ఎప్పుడూ ఫార్మల్ కోట్, సూట్లలోనే చూసిన అభిమానులకు, ఈ పట్టుపంచె లుక్ ‘మెర్సల్’ సినిమా రోజుల్లోని మాస్ అండ్ క్లాస్ విజయ్‌ని గుర్తుచేసింది. గృహప్రవేశ పూజలో పాల్గొని జగదీష్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన విజయ్, వారితో కలిసి ఎంతో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ను మీడియాని  ఊపేస్తున్నాయి. ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్‌లలో #ThalapathyVijay, #CMVijay లుక్స్ ట్రెండింగ్‌లో నిలిచాయి.ఏది ఏమైనా ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం, వేసే ప్రతి అడుగు తమిళనాడు రాజకీయాల్లో సెన్సేషన్ అయిపోతుంది. సినిమాల్లోనే కాదు, అటు రాజకీయాల్లో, ఇటు రియల్ లైఫ్ రిలేషన్స్‌లోనూ ఎల్లప్పుడూ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అని ఈ ఘటనతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు విజయ్ .

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×