E-Paper
Advertisement

కారు విపరీంతగా వేడెక్కిందా? ఈ సింపుల్ ట్రిక్స్ లో ఈజీగా కూల్ చేసేయండి!

కారు విపరీంతగా వేడెక్కిందా? ఈ సింపుల్ ట్రిక్స్ లో ఈజీగా కూల్ చేసేయండి!
Advertisement

వేసవిలో ఎండలో ఎక్కువసేపు నిలిపిన కారులోకి ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కారు లోపలి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సీట్లు వేడెక్కిపోవడం, స్టీరింగ్ పట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, పెంపుడు జంతువులతో ప్రయాణించే సమయంలో  ఈ వేడి మరింత ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏసీపై ఎక్కువ భారం పడకుండా కారును ఈజీగా చల్లబరచడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ లోపలి గాలిని బయటకు పంపాలి!

Advertisement

కారులోకి ఎక్కిన వెంటనే ఏసీని ఫుల్ స్పీడ్‌ లో ఆన్ చేయడం కంటే, ముందుగా లోపల ఉన్న వేడి గాలిని బయటకు పంపడం మంచిది. ఇందుకోసం కారుకు ఒక వైపు ఉన్న కిటికీని పూర్తిగా కిందికి దించాలి. ఆ తర్వాత ఎదురు వైపు డోర్ ను ముందుకు వెనుకకు కదపాలి. ఇలా చేయడం వల్ల కారులోని వేడి గాలి బయటకు వెళ్లి, బయట ఉన్న కొంచెం చల్లటి గాలి లోపలికి వస్తుంది. ఈ పద్ధతి త్వరగా వేడిని తగ్గించడంలో సాయపడుతుంది.

⦿ అన్ని విండోలు ఓపెన్ చేయాలి!

కొంత వేడి బయటకు వెళ్లిన తర్వాత కారులో కూర్చొని మిగతా కిటికీలను కూడా కొద్దిసేపు కిందికి దించాలి. తర్వాత ఏసీని ఆన్ చేసి డ్రైవింగ్ మొదలుపెట్టాలి. కారు కదులుతున్నప్పుడు ఏసీ మరింత బాగా పని చేస్తుంది. వేడి గాలి పైకి లేస్తుండటంతో, ఓపెన్ చేసిన విండోస్ ద్వారా ఈజీగా బయటకు వెళ్తుంది.

⦿ ఎయిర్ రీసర్క్యులేషన్ మోడ్‌ ఆన్ చెయ్యొద్దు!

Advertisement

చాలా మంది చేసే  సాధారణ తప్పు ఏమిటంటే, కారులోకి ఎక్కిన వెంటనే ఎయిర్ రీసర్క్యులేషన్ మోడ్‌ను ఆన్ చేస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే కారులో ఉన్న గాలి ఇప్పటికే చాలా వేడిగా ఉంటుంది.  ఏసీ అదే వేడి గాలిని మళ్లీ మళ్లీ చల్లబరచడానికి ప్రయత్నిస్తుంది. అందుకే మొదట బయటి గాలిని ఉపయోగించే మోడ్‌ లో ఏసీని నడపడం మంచిది. దీంతో కారు త్వరగా చల్లబడుతుంది.

⦿ జనరల్ కూలింగ్ మోడ్ ఆన్ చేయండి!

ఎయిర్ రీసర్క్యులేషన్ బటన్‌పై సాధారణంగా గుండ్రని బాణం గుర్తుతో కార్ సింబల్ ఉంటుంది. చాలామంది  మ్యాక్స్ కూల్  సెట్టింగ్ ఉపయోగిస్తారు. కానీ, కొన్ని కార్లలో అది ఆటోమేటిక్‌గా రీసర్క్యులేషన్‌ ను ఆన్ చేస్తుంది. అందుకే మొదట సాధారణ కూలింగ్ మోడ్‌లో ఏసీని నడపడం మంచిది.

⦿ విండోస్ ఎప్పుడు క్లోజ్ చేయాలంటే?

కారు లోపలి ఉష్ణోగ్రత కొంతవరకు తగ్గి, బయట ఉష్ణోగ్రతకు దగ్గరగా వచ్చిన తర్వాత కిటికీలను మూసేయాలి. ఇప్పుడు ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి బయటకు పోకుండా ఉంటుంది. ఆ తర్వాత అవసరమైతే ఎయిర్ రీసర్క్యులేషన్ మోడ్‌ ను ఆన్ చేయవచ్చు. అలా చేస్తే త్వరగా క్యాబిన్‌ ను చల్లబరచడంలో సహాయపడుతుంది.

Read Also: AMT vs CVT vs DCT vs DSG.. వామ్మో.. ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ లో ఇన్ని రకాలున్నాయా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×