E-Paper
Advertisement

Karnataka CM Seat Tussle: కర్ణాటకలో సీఎం కోసం సీటు కుస్తీ.. దిల్లీకి చేరిన పంచాయితీ

Karnataka CM Seat Tussle: కర్ణాటకలో సీఎం కోసం సీటు కుస్తీ.. దిల్లీకి చేరిన పంచాయితీ
Advertisement

Karnataka CM Seat Tussle: కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం సీటు కోసం అగ్ర సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోరు తీవ్రమైంది. కన్నడ నాటి రాజకీయాలు బిగ్ బాస్ ను మించిపోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నాయకత్వ పోరు తీవ్రమవుతోంది. తాజాగా సీఎం సీటు పంచాయితీ దిల్లీకి మారింది.

వక్కలిగ వర్గానికి చెందిన శివకుమార్ ఇక తన ఓపిక నశించిందని పరోక్షంగా సూచనలు చేస్తున్నారు. ఓబీసీ నాయకుడు సిద్ధరామయ్య 2028 వరకు తానే సీఎం అంటున్నారు. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి చేయడంపై సందేహం నెలకొంది. సిద్ధరామయ్య, శివకుమార్ వర్గాలు దిల్లీలో లాబీయింగ్‌ మొదలుపెట్టాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు విధేయులైన 10 మంది ఎమ్మెల్యేలు దిల్లీకి బయలుదేరారని సమాచారం. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చేస్తామని కాంగ్రెస్ అధి నాయకత్వం హామీ ఇచ్చిందని డీకే వర్గం చెబుతోంది.

సీఎం సీటు పంచాయితీ

Advertisement

కర్ణాటక డ్రామా ఇప్పుడు 1,800 కి.మీ దూరంలోని దిల్లీకి మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, శివకుమార్ సహా సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ చర్చించి ఈ గందరగోళానికి ముగింపు పలుకుతుందని ఖర్గే అన్నారు.
హైకమాండ్ నిర్ణయిస్తే డీకే శివకుమార్‌ను సీఎంగా అంగీకరించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని సిద్ధరామయ్యకు సన్నిహితుడైన హోంమంత్రి పరమేశ్వర అన్నారు. సిద్ధరామయ్య మద్దతుదారుడు జమీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. 2028 వరకు సీఎం పదవి ఖాళీగా లేదని స్పష్టంచేశారు.

డీకే శివకుమార్ పరోక్షంగా తన అసహనానికి వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి మాట నిలబెట్టుకోవడం’ అని రాశారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ అయిన శివకుమార్ .. గతంలో మాట్లాడుతూ.. పార్టీలోని 5-6 మందికి మాత్రమే అధికారాన్ని పంచుకునే “రహస్య ఒప్పందం” గురించి తెలుసని అన్నారు. తనను ముఖ్యమంత్రిని చేయమని ఏనాడూ అడగలేదన్నారు.

ట్రబుల్ షూటర్ కే ట్రబుల్

Advertisement

కాంగ్రెస్‌లో ట్రబుల్‌షూటర్‌గా పిలిచే శివ కుమార్ తన ఎత్తుగడలు వేస్తున్నారు. శివకుమార్ మంగళవారం సిద్ధరామయ్య సహాయకుడు సతీష్ జార్కిహోలితో అర్ధరాత్రి సమావేశం అయ్యారు. సిద్ధరామయ్యను విడిచిపెట్టనని జార్కిహోళి ఆయనకు చెప్పారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. శివకుమార్ ఇటీవల బెంగళూరుకు వచ్చినప్పుడు కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను కలవలేదు. ఖర్గే సిద్ధరామయ్యతో గంటసేపు సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీతో కూడా శివ కుమార్ మాట్లాడలేకపోయారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Also Read: Delhi Blast Case Update: ఢిల్లీ బ్లాస్ట్ కేసు, వాళ్లిద్దరు భార్యాభర్తలే, ఆపై నిధులు సేకరణ కూడా

అయితే ఇద్దరు నాయకులు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటన చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు జరగనున్నాయని బీజేపీ ప్రచారం చేస్తుండడంతో.. ఆ వాదనలను ఇరువురు నేతలు తోసిపుచ్చారు. 140 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారని చెబుతున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×