E-Paper
Advertisement

GCC: హైదరాబాద్‌‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. వెయ్యికి పైగా ఉద్యోగాలు!

GCC: హైదరాబాద్‌‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. వెయ్యికి పైగా ఉద్యోగాలు!
Advertisement

GCC: గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను (GCC) నెలకొల్పడంలో మియామిన్ కార్ప్ చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. హైదరాబాద్‌లో అతిపెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఒక ప్రపంచ విమానయాన దిగ్గజం కోసమే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది దాదాపుగా ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ అయి ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మెగా జీసీసీ కోసం మియామిన్ కార్ప్ 4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని సిద్ధం చేస్తూ.. 1,000 పైగా ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రణాళికలు వేసింది.

మరి క్లయింట్ ఎవరు..? 

Advertisement

మియామిన్ కార్ప్ క్లయింట్ పేరు వెల్లడించకపోయినా.. ఈ కేంద్రం వెనుక గ్లోబల్ ఏవియేషన్ కంపెనీ హస్తం ఉందనే చర్చ మాత్రం జోరుగా నడుస్తోంది. ఇటీవల పెరిగిన చర్చ నేపథ్యంలో..  దాని పేరు బోయింగ్ కావొచ్చని తెలుస్తోంది. లేదంటే.. మియామిన్ కార్ప్‌కు ఇప్పటికే ముఖ్య క్లయింట్‌గా ఉన్న ఎమిరేట్స్ అయినా కావచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ కొత్త కేంద్రం వల్ల హైదరాబాద్ ఐటీ రంగంలో మరింత వృద్ధి సాధించే అవకాశం ఉంది.

కొత్త జీసీసీ వేవ్ పై విమర్శలకు చెక్

Advertisement

కొత్తగా ఏర్పాటు చేసే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ద్వారా వెయ్యి మందికి పైగా ఉద్యోగం అవకాశం లభించనుంది. వివిధ అనుభవ స్థాయిలకు ఇక్కడ అందిస్తున్న జీతాలు భారీగానే ఉండనున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా హైదరాబాద్ జీసీసీలు కేవలం పెద్ద సంఖ్యలో ఉద్యోగాల అవకాశం కల్పించడంతో పాటు మంచి వేతనం కూడా అందజేస్తున్నట్టు స్పష్టమవుతోంది.

2025 హైదరాబాద్ స్వర్ణయుగం

75 పైగా జీసీసీలు, ఒక్క 2025 సంవత్సరంలోనే అద్భుతంగా 31 ఫార్చ్యూన్ 500 కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించడంతో.. 2025 సంవత్సరం నిజంగా హైదరాబాద్ విజయాన్ని ప్రకటించింది. ఈ అపూర్వమైన వృద్ధి హైదరాబాద్‌ను భారతదేశంలో జీసీసీ రాజధానిగా నిలబెట్టే అవకాశం ఉంది.

ALSO READ: Peddi special Video : 100 మిలియన్ వ్యూస్ ఊరికే రాలేదు, రామ్ చరణ్ కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×