E-Paper
Advertisement

Morning Walk: చలిలోనూ మార్నింగ్ వాక్‌కి వెళ్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే అంటున్న నిపుణులు!

Morning Walk: చలిలోనూ మార్నింగ్ వాక్‌కి వెళ్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే అంటున్న నిపుణులు!
Advertisement

Morning Walk: నేటి ఆధునిక జీవనశైలిలో వాకింగ్ కేవలం వ్యాయామం మాత్రమ కాదు.. ఆరోగ్యకరమైన జీవన విధానంలో ఒక ముఖ్యమైన భాగం కూడా. అయితే, చాలామంది ఉదయం పూట వాకింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లడం వలన అనేక బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నడక వల్ల గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపగుతుంది. అలాగే వాకింగ్ రక్త ప్రవాహాన్ని పెంచి, కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ నేథ్యంలో వణికించే చలిలో మార్నింగ్ వాక్‌కు వెళ్లాలా? వద్దా? అని చాాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్లకి నిపుణులు ఇచ్చే సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మార్నింగ్ వాక్ మంచిదేనా?

మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పుటికీ.. కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లటి వాతావరణంలో నడవటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, జీవక్రియ వేగవంతం అవుతుంది. అలాగే, ఉదయం పూట వాకింగ్ చేయడం వల్ల తాజా గాలి, తేలికపాటి సూర్యకాంతి విటమిన్ డిని శరీరానికి అందుతాయి. ఇది ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.

Advertisement

Read Also: బేర్‌ఫుట్‌తో మానసిక ఆరోగ్యం మెరుగు.. ఇలా రోజూ నడిచారంటే రోగాలు పరిగెడతాయ్!

అలాంటి వాళ్లు జాగ్రత్త:

ఉబ్బసం, రక్తపోటు లేదా గుండె జబ్బులు వంటి సమస్యలున్న వాళ్లు మార్నింగ్ వాక్‌కు వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. చలిలో వెచ్చని దుస్తులు ధరించకుండా వాకింగ్‌కు వెళ్లడం వల్ల జలుబు, తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. ఇలాంటి వాళ్లు ఉదయం పూట ఆలస్యంగా లేదా మధ్యాహ్నం సమయంలో నడవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

Advertisement

* మార్నింగ్ వాక్‌కు వెళ్లేటప్పుడు కచ్చితంగా వెచ్చని దుస్తులు ధరించాలి. ఉష్ణోగ్రతను బట్టి, రెండు లేదా మూడు పొరల బట్టలు వేసుకుంటే సరి.
* వాతావరణం మరీ చల్లగా ఉంటే.. చేతులు, కాళ్లు, చెవులను తప్పనిసరిగా కప్పి ఉంచేలా గ్లౌజులు, సాక్సులు, క్యాప్ ధరించాల్సిందే.
* ఉబ్బసం, రక్తపోటు సమస్యలు ఉన్నవాళ్లు నడకను వేగంగా కాకుండా నెమ్మదిగా ప్రారంభించాలి. తర్వాత వేగాన్ని పెంచుకోవాలి.
* మంచులో చల్లని గాలి నేరుగా గొంతు, ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఉండటానికి అవసరమైతే మాస్క్ ధరించడం ఎంతైనా అవసరం.
* వాకింగ్ ప్రారంభించడానికి ముందు డీహైడ్రేషన్ జరగకుండా ఉండటానికి వాకింగ్‌కు ముందు, తర్వాత తగినంత నీరు తాగాలి.
* వాకింగ్ ప్రారంభించడానికి వాతావరణం కొద్దిగా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వాకింగ్ యొక్క ప్రయోజనాలను పొందవగలరు.

Read Also: నాలుగు పదుల వయసులోనూ ఫిట్‌నెస్.. ఆ కిటుకు మన చేతుల్లోనే ఉందన్న నిపుణులు!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×