E-Paper
Advertisement

Sonia Gandhi Birthday: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు

Sonia Gandhi Birthday: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు
Advertisement

Sonia Gandhi Birthday: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ 79వ పుట్టినరోజు వేడుకలను ఢిల్లీలోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలు, నాయకులు, పలువురు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ పెట్టారు.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియా గాంధీ నేడు (డిసెంబరు 9) 79లోకి అడుగు పెట్టారు. దీంతో ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ పెద్దలు కేక్ కట్ చేసి సోనియమ్మకు బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ కుమార్ యాదవ్, రాజ్యసభ ఎంపీ అనీల్ కుమార్ యాదవ్ పలువురు ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు.

Advertisement

‘సోనియా గాంధీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలగాలి’ అని ప్రధాని మోదీ Xలో ట్వీట్ చేశారు.

సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘సముద్రం అంత లోతైన.. ఆకాశం అంత ఎత్తయిన.. ఏ సవాలునైనా మనం కలిసి ఎదుర్కోగలం’ అని సోనియా గాంధీ రాసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పోస్ట్ చేసింది. సోనియమ్మ మాటలు ప్రజా జీవితంలో, నిజ జీవితంలో ఆమె కలిగి ఉన్న బలం, దయ, గౌరవాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని పోస్టులో తెలిపారు. అలాగే సోనియా గాంధీ అచంచలమైన సమగ్రత, కరుణ, ధైర్యంతో జీవిస్తుందని పార్టీ సభ్యులు తెలిపారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×