// // Akhanda 2- అఖండ 2 పోస్టర్‌తో శబరిమల కొండపై భక్తుడు -->
E-Paper
Advertisement

Akhanda 2: అఖండ 2 హిట్‌ కొట్టాలి.. మూవీ పోస్టర్‌తో శబరిమల కొండ ఎక్కిన అయ్యప్ప భక్తుడు

Akhanda 2: అఖండ 2 హిట్‌ కొట్టాలి.. మూవీ పోస్టర్‌తో శబరిమల కొండ ఎక్కిన అయ్యప్ప భక్తుడు
Advertisement

Akhanda 2 Movie: అఖండ 2 మూవీ రిలీజ్ అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అని అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు డిసెంబర్‌ 5న మూవీ విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. అనుకున్న తేదీకి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన ఈ చిత్రం చివరి నిమిషంలో వాయిదా పడటం సంచలనంగా మారింది.

రిలీజ్ డేట్‌పై ఉత్కంఠ

Advertisement

అగ్ర హీరో సినిమా, పైగా భారీ బడ్జెట్‌తో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం రిలీజ్ కొన్ని గంటల ముందు వాయిదా పడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో కొత్త రిలీజ్ డేట్‌పై ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది. మూవీ వాయిదా పడటంతో అభిమానులం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాను వెంటనే రిలీజ్ చేయాలంటూ ఫ్యాన్స్‌ నుంచి డిమాండ్స్‌ వస్తున్నాయి. మరికొందరైతే ప్లీజ్‌ మూవీ ఇంకా వాయిదా వేయకండి.. వీలైనంత తొందరలో రిలీజ్ చేయాలంటూ మూవీ టీంకి రీక్వెస్ట్‌లు వెల్లువెత్తున్నాయి. ఈ తరుణంలో కొత్త రిలీజ్ డేట్‌ని డిసెంబర్‌ 12న కన్‌ఫాం చేసినట్టు తెలుస్తోంది. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. అయితే అఖండ 2 రిలీజ్ ఆలస్యం అవ్వడంతో మూవీ ఫలితంపై ఫ్యాన్స్‌, మేకర్స్‌ ఆందోళన చెందుతున్నారు.

అఖండ 2 పోస్టర్‌తో శబరిమలకు

అనుకున్న తేదీకి రాకపోవడం ఆడియన్స్‌ అంత అసహనంలో ఉన్నారు. దీంతో మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఓ అభిమాని ఏకంగా శబరమల కొండెక్కి అఖండ 2 భారీ విజయం సాధించాలని కోరుకున్నారు. ఇవాళ (మంగళవారం) బాలయ్య అభిమాని ఒకరు అయ్యప్ప దీక్ష పూర్తి చేసి శబరిమల కొండకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన కొండ ఎక్కుతూ అఖండ 2 పోస్టర్ పట్టుకుని మూవీ ఘన విజయం సాధించాలి అని కోరుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతంది. బాలయ్య అభిమానులంత ఈ వీడియో స్పందిస్తూ అఖండ 2 బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నారు. కాగా మూవీ సినిమా విడుదల కాబోతుందంటేనే బజ్‌ ఈ హంగామా ఈ రేంజ్‌ లో ఉంటే ఇక మూవీ విడుదలల త‌ర‌వాత బాల‌య్య ఫ్యాన్స్ జోరు ఏ రేంజ్ లో ఉండ‌బోతుందో అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

Advertisement

ఆర్థిక లావాదేవి వల్ల మూవీ వాయిదా

కాగా ఆర్థిక లావాదేవిల కారణంగా అఖండ 2 మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ సంస్థ గతంలో 1 నేనొక్కడినే, ఆగడు మూవీలకి సంబంధించిన ఫైనాన్స్‌ని బాలీవుడ్‌ ఏరోస్ ఫైనాన్స్‌ సంస్థ నుంచి పైనాన్స్‌ తీసుకున్నారు. అప్పటి లావాదేవీలు పెండింగ్‌లో పెట్టడంతో అవి వడ్డితో కలిపి రూ. 70 కోట్ల వరకు బాకీ పడ్డారు. అయితే ఇప్పుడు ఆ లావాదేవీలు తీరిస్తే తప్ప మూవీ రిలీజ్‌ కి అనుమతి ఇవ్వోద్దని ఏరోస్‌ సంస్థ కోర్టులో పిటిషన్‌ వేసింది. దీంతో రిలీజ్‌ కి చివరిలో నిమిషంలో మూవీ వాయిదా పడింది. ఈ విషయం అఖండ 2 టీం కోర్టును ఆశ్రయించడం మూవీ రిలీజ్ కి న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో డిసెంబర్‌ 12న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌ గా విడుదల కానుంది. డిసెంబర్‌ 11న భారీ స్థాయిలో ప్రీమియర్‌ షోలు పడనున్నాయి. దీంతో అఖండ 2 ఆగమనంతో డిసెంబర్‌ 12న విడుదల కావాల్సిన సుమారు 16 చిన్న, చితకా చిత్రాలు వాయిదా పడనున్నాయి.

Also Read: Global Summit 2025: సినిమా రైజింగ్‌ సెషన్‌.. సీఎం రేవంత్‌ రెడ్డితో సినీ ప్రముఖుల భేటి!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×