E-Paper
Advertisement

Sonia Gandhi: బర్త్ డే రోజు సోనియా గాంధీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు నోటిసులు, ఎందుకంటే?

Sonia Gandhi: బర్త్ డే రోజు సోనియా గాంధీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు నోటిసులు, ఎందుకంటే?
Advertisement

Sonia Gandhi: ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కీలక నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందే ముందు ఆమె పేరును ఓటర్ల జాబితాలో చేర్చారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఈ విషయంలో వివరణ ఇవ్వాలని కోరుతూ సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు పంపింది.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఆమె పేరును ఓటర్ల జాబితాలో చేర్చడంపై పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ నారంగ్ వాదనలు వినిపిస్తూ, 1980 సంవత్సరంలో ఓటర్ల జాబితాలో సోనియా గాంధీ పేరును చేర్చడానికి నకిలీ పత్రాలు సృష్టించారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనల నేపథ్యంలోనే ఆమె పేరును అప్పట్లో ఓటర్ల లిస్టు నుంచి తొలగించడం జరిగిందని వివరించారు.

Advertisement

అయితే, తర్వాత మళ్లీ 1983లో సోనియా గాంధీ పేరును ఓటర్ల జాబితాలో తిరిగి చేర్చడం జరిగిందని న్యాయవాది నారంగ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పౌరసత్వం పొందిన అంశం, అలాగే ఓటర్ల జాబితాలో ఆమె పేరును చేర్చిన ప్రక్రియలపై స్పష్టమైన వివరణ అవసరమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

ఈ పిటిషన్ మరియు వాదనలను పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఈ రెండు కీలక అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సోనియా గాంధీకి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

ALSO READ: Ind vs SA1st T20I: మ‌రోసారి టాస్ ఓడిన టీమిండియా..గిల్‌, పాండ్యా వ‌చ్చేశారు..ఇక కాటేర‌మ్మ కోత మొద‌లు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×