E-Paper
Advertisement

Delhi: కాలుష్యం ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఢిల్లీ విద్యార్థులకు పండగే పండుగ

Delhi: కాలుష్యం ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఢిల్లీ విద్యార్థులకు పండగే పండుగ
Advertisement

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో విషపూరితంగా మారుతున్న గాలి కాలుష్యం.. ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న ప్రజలకు.. ఇప్పుడు చలి కూడా తోడైంది. రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఇది ఊహించిన దానికంటే చాలా ముందు సమయం అంటున్నారు అధికారులు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈసారి రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు.

Advertisement

ఢిల్లీ ప్రాంతంలో వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతోంది. నవంబర్ 11న ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 425కి చేరడంతో కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరింది. అయితే ఇది ప్రధానంగా పొగమంచు, స్థిరమైన వాతావరణం, పొక్క మండడం, వాహనాల నుంచి ఉద్గారంచే విషవాయువులు, నిర్మాణాలు వంటి కారణాల వల్లే జరిగిందని చెబుతున్నారు. SAFAR ప్రకారం, ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో AQI 400 పైనే ఉంది. ఇది పిల్లలు, వృద్ధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి తీవ్రమైన ప్రమాదంగా మారుతుందని తెలిపారు. ప్రజలు ఈ విష వాయువులు పీల్చడం వల్ల అస్థమా, శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు పెరుగుతున్నాయి.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో చంపేస్తున్న చలి.. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

Advertisement

దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ 1 నుంచి 5వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా అన్ని పాఠశాలల వారు తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా ఈ నిర్ణయాన్ని “పిల్లల భద్రతకు ప్రాధాన్యత”గా పేర్కొంది. ఈ నిర్ణయంతో వాహనాలు తగ్గే అవకాశం ఉందని.. దీంతో కాలుష్యం తగ్గుతుందని సూచించింది. కానీ కొందరు తల్లిదండ్రులు చిన్న పిల్లలకు మాత్రమే కాకుండా హై స్కూల్ విద్యార్థులకు కూడా ఆన్‌లైన్ క్లాసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రేఖా గుప్తా ప్రజలు మాస్కులు ధరించడం, ఇంట్లోనే ఉండటం, బయటి ఆహారం తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×