E-Paper
Advertisement

Konda Surekha : నాగార్జున ఫ్యామిలీ పై మరోసారి స్పందించిన మంత్రి కొండా సురేఖ..అర్ధరాత్రి సంచలన ట్వీట్..

Konda Surekha : నాగార్జున ఫ్యామిలీ పై మరోసారి స్పందించిన మంత్రి కొండా సురేఖ..అర్ధరాత్రి సంచలన ట్వీట్..
Advertisement

Konda Surekha : టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. అటు రాజకీయాలను ఇటు సినీ ఇండస్ట్రీలను ఆమె వ్యాఖ్యలపై అనేక చర్చలు జరిగాయి. ఫైనల్ గా మంత్రి దిగోచ్చి సమంతకు క్షమాపణ చెప్పింది ఆ తర్వాత ఈ ఇష్యూ పై పెద్దగా ఎవరు స్పందించలేదు. రాజధా మరోసారి నాగార్జున ఫ్యామిలీ పై సంచలన ట్వీట్ చేశారు మంత్రి కొండా సురేఖ.. అర్ధరాత్రి ఆమె ట్వీట్ చెయ్యడంతో ఇప్పుడు అది సంచలనంగా మారింది.. అందులో ఏముందంటే..

నాగార్జున ఫ్యామిలీపై మంత్రి ట్వీట్…

తెలంగాణ మంత్రి కొండా సురేఖ గతంలో నాగర్జున కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో చర్చనీయాంశంగా మారిన ఘటన పై మంత్రి కొండా సురేఖ స్పందించారు. అర్థరాత్రి మంత్రి నాగార్జున కుటుంబం పై ట్వీట్ చేశారు. అందులో ఏముందంటే.. గతంలో నాగార్జున, ఆయన ఫ్యామిలీపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు కొండా సురేఖ. నాగార్జున ఫ్యామిలీని కించపరచాలన్న ఉద్దేశం తనకు ఎక్కడ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలతో వారు బాధపడి ఉంటే, అందుకు చింతిస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ రాసుకొచ్చారు. అర్ధరాత్రి తర్వాత ఆమె ట్వీట్ చెయ్యడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు కొండా సురేఖ ఇలా రియాక్ట్ అయినట్లు చర్చ జరుగుతోంది.. మరి ఆమె ఆ సమయంలో ఎందుకు ట్వీట్ చేశారు..? నాగార్జున దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Advertisement

Also Read : పల్లవికి దిమ్మతిరిగే షాక్.. మీనాక్షికి పల్లవి క్షమాపణలు.. అవని స్ట్రాంగ్ వార్నింగ్..

మంత్రి పై నాగార్జున పరువు నష్టం కేసు..

హీరో అక్కినేని నాగార్జున పై, ఆయన కుటుంబ సభ్యుల పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసింది.. నాగచైతన్య – సమంత విడాకులను ప్రస్తావించారు. కేటీఆర్ వల్లే వారు విడాకులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ కామెంట్స్ రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని ఫ్యామిలీ తీవ్రంగా ఖండించింది. ఆ వ్యాఖ్యల పై స్పందించిన నాగార్జున. నా కుటుంబ పరువు అని తీసేశారు మంత్రి.. నన్ను నా కుటుంబ సభ్యులను కించపరచ విధంగా మాట్లాడారు అంటూ నాగర్జున ఆవిడ పై పరువు నష్టం దావా కేసు వేశారు. ఇప్పటికే ఈ కేసు కోర్టులో ఉంది. ఆ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఆమె ట్వీట్ చెయ్యడం అందరిని ఆలోచనలో పడేసింది. నాగార్జున, ఆయన కుటుంబాన్ని కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.. అయితే ఈ ట్వీట్ అర్ధరాత్రి తర్వాత చెయ్యడంతో ఏదో జరుగుతుందని నెటిజన్లు సోషల్ మీడియాలో వేధికగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మంత్రి కొండా సురేఖ గాని, అటు నాగార్జున కానీ స్పందించి వివరణ ఇస్తారేమో చూడాలి…

Advertisement

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×