E-Paper
Advertisement

Kirshna Statue: కృష్ణ విగ్రహాన్ని తీసేయండి.. భీమవరంలో కొత్త రచ్చ

Kirshna Statue: కృష్ణ విగ్రహాన్ని తీసేయండి.. భీమవరంలో కొత్త రచ్చ
Advertisement

Kirshna Statue: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం అంశం వివాదాస్పదంగా మారింది. భీమవరం పట్టణంలోని ఎడ్వర్డ్ ట్యాంక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా నోటీసులు జారీ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. విగ్రహం ఏర్పాటు కోసం అవసరమైన అన్ని అనుమతులు పొందిన తరువాతే ప్రతిష్ఠ చేశామని సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఈ విగ్రహాన్ని 2024 మార్చి నెలలో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కలిసి అధికారికంగా ఆవిష్కరించారు. అయితే.. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు విగ్రహం తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిమానులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన కృష్ణ అభిమానులు హైకోర్టును ఆశ్రయించగా.. విగ్రహం తొలగింపుపై కోర్టు స్టే ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

స్టే ఉన్నప్పటికీ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తే తీవ్ర నిరసనలు చేపడతామని అభిమాన సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ వివాదంలో కృష్ణ అభిమానులకు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ప్రభాస్ అభిమానులు మద్దతు ప్రకటించడం గమనార్హం. భీమవరం పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ అంశంపై మున్సిపల్ కార్పొరేషన్, అభిమాన సంఘాల మధ్య చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని స్థానికులు కోరుతున్నారు.

ALSO READ: Jakkampudi Raja: నన్నయ యూనివర్సిటీలో గొడవ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు

Advertisement

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×