E-Paper
Advertisement

Jakkampudi Raja: నన్నయ యూనివర్సిటీలో గొడవ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు

Jakkampudi Raja: నన్నయ యూనివర్సిటీలో గొడవ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు
Advertisement

Jakkampudi Raja: నన్నయ విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన ఘటనలపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ప్రచార పిచ్చితోనే యూనివర్సిటీలో గొడవ జరిగిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యారంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే పని చేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టిపోతోందని విమర్శించారు.

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ఘోరాలు, దారుణాలు చూస్తున్నామని అన్నారు. వీసీలను భయపెట్టి, ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించారని ఆరోపించారు. నాయకుడు ఏ మార్గంలో ముందుకు వెళ్తాడో అదే మార్గాన్ని వారి అనుచరులు అనుసరిస్తున్నారని, దీనికి నన్నయ యూనివర్సిటీలో జరిగిన గొడవే నిదర్శనమని చెప్పారు.

Advertisement

విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు, రంగులు ప్రదర్శించకూడదనే కనీస ఇంగిత జ్ఞానం ప్రజా ప్రతినిధులకు లేకుండా పోయిందని మండిపడ్డారు. అర్ధరాత్రి యూనివర్సిటీలో చొరబడి గ్లాస్, సైకిల్ గుర్తులు ఉన్న నాయకుల బ్యానర్లు కట్టడం తప్పని అన్నారు. దీనిని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే సతీమణి వీసీపై దాడి చేసేందుకు ప్రయత్నించారని, వీసీని అడ్డుకున్న అటెండర్ చరణ్‌పై దారుణంగా దాడి చేశారని తెలిపారు.

కనీసం 8వ తరగతి కూడా పాస్ కాకపోయిన స్థానిక ఎమ్మెల్యే బలరామకృష్ణ, అతడి సతీమణి అత్యున్నత విద్యావంతుడైన వీసీని కులపరంగా దూషించడం దారుణమని వ్యాఖ్యానించారు. నన్నయ యూనివర్సిటీ కోసం తన తండ్రి రామ్మోహన్ రావు వేసిన పునాది రాయిని తొలగించినప్పటికీ తాము సంయమనం పాటించామని గుర్తు చేశారు. యూనివర్సిటీ భవనాలు తమ హయాంలోనే పూర్తయ్యాయని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు.

Advertisement

ALSO READ: Madurai-Rameswaram train: రైలులో టిక్కెట్ లేకుండా 300 మంది ప్రయాణం.. అధికారులు తనిఖీలు చేయగా.. పరుగో పరుగు..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×