// // PNB Recruitment: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 5,138 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల -->
E-Paper
Advertisement

PNB Recruitment: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 5,138 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

PNB Recruitment: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 5,138 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
Advertisement

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 5,138 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి మేనేజ్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు బ్యాంకింగ్ రంగంలో విలువైన పని అనుభవాన్ని పొందడమే కాకుండా, నిర్ణీత కాలానికి స్టైపెండ్ కూడా అందుకుంటారు.

రాష్ట్రాల వారీగా వెకెన్సీ వివరాలు.. 

Advertisement

మొత్తం 5,138 ఖాళీలలో దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు గణనీయమైన ప్రాధాన్యత లభించింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణలో 69 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు (121), కేరళ (83), కర్ణాటక (64), ఒడిశా (142), పాండిచ్చెరి (02) పోస్టులు ఉన్నాయి. మిగిలిన పోస్టులను ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో భర్తీ చేయనున్నారు.

తెలంగాణ: 69

Advertisement

ఆంధ్రప్రదేశ్: 56

విద్యార్హత, వయస్సు వివరాలివే.. 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసి ఉండాలి.

అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు మినహాయింపు లభిస్తుంది.

ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు వివరాలు..

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనబరిచిన వారికి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (స్థానిక భాషా పరీక్ష), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.

జీతం: ఎంపికైన వారికి నెలకు రూ. 12,300 నుంచి రూ. 15,000 వరకు స్టైపెండ్ అందజేస్తారు.

దరఖాస్తు రుసుము విషయానికి వస్తే, జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 600 నుండి రూ. 800 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జెండర్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 200 గా నిర్ణయించారు.

ఇంపార్టెంట్ డేట్స్: 

ఆసక్తి గల అభ్యర్థులు 2026, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 24, 2026. అర్హత కలిగిన అభ్యర్థులు పీఎన్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://pnb.bank.in/

ALSO READ: AI Safety Jobs: ఏఐతో భయపడాల్సిన అవసరం లేదు.. ఈ ఉద్యోగాలు పూర్తిగా సురక్షితం

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×