E-Paper
Advertisement

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Advertisement

TG CPGET 2026 online exam schedule: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదవాలనుకునే అభ్యర్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రముఖ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ 2026 ప్రవేశ పరీక్షల టైమ్ టేబుల్ అధికారికంగా విడుదలైంది. ఈ ఏడాది కాకతీయ విశ్వవిద్యాలయం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎగ్జామ్ బాధ్యతలను తీసుకుంది. అయితే అభ్యర్థులుఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షల తేదీలను ఎగ్జామ్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేందర్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9 యూనివర్సిటీలలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

పరీక్షల టైమ్ టేబుల్ :
ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన సీపీజీఈటీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) జులై 8వ తేదీన ప్రారంభమై జులై 15వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన డిజిటల్ పరీక్షా కేంద్రాలలో ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రతిరోజూ మూడు వేర్వేరు సెషన్లలో ఆన్‌లైన్ ద్వారా పరీక్షలను నిర్వహిస్తారు. విద్యార్థులు తమకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా పూర్తి టైమ్ టేబుల్‌ను cpget.tgche.ac.in లేదా www.kakatiya.ac.in లాంటి అధికారిక వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు.

Advertisement

ప్రవేశం పొందగలిగే… విశ్వవిద్యాలయాలు:
ఈ ప్రవేశ పరీక్ష రాయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత క్రేజ్ ఉన్న ప్రధాన వర్సిటీలలో M.A, M.Sc, M.Com, M.Ed లాంటి పీజీ కోర్సులలో అడ్మిషన్ దక్కించుకోవచ్చు. ఈ జాబితాలో ఉస్మానియా యూనివర్సిటీ (OU), కాకతీయ యూనివర్సిటీ (KU), తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జేఎన్‌టీయూహెచ్ (JNTUH), వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ ,కొత్తగూడెంలోని సరికొత్త మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలు ఉన్నాయి.

పరీక్షా సరళి, ప్రశ్నల విధానం:
పరీక్ష రాయడానికి అభ్యర్థులకు కేవలం 90 నిమిషాల (గంటన్నర) సమయం మాత్రమే కేటాయిస్తారు. మొత్తం 100 మార్కులకు గాను 100 ఆబ్జెక్టివ్ తరహా మల్టీపుల్ ఛాయిస్ (MCQ) ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. నెగెటివ్ మార్కులు లేవు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×