E-Paper
Advertisement

Garuda Purana Part 03: మూడో పట్టణం నగేంద్రభవనం చేరుకున్న ఆత్మ – పెళ్లాం పిల్లలు గుర్తొచ్చి రోదిస్తుందట

Garuda Purana Part 03: మూడో పట్టణం నగేంద్రభవనం చేరుకున్న ఆత్మ – పెళ్లాం పిల్లలు గుర్తొచ్చి రోదిస్తుందట
Advertisement

Garuda Purana Part 03: గరుడ పురాణం ప్రకారం, జీవుడు తన యమలోక ప్రయాణంలో చేరుకునే మూడవ పట్టణం నగేంద్రభవనం. సౌరిపురం తర్వాత వచ్చే ముఖ్యమైన ఘట్టం ఈ నగేంద్ర భవనం. మనిషి మరణించిన తర్వాత మూడవ నెలలో ఆత్మ ఈ నగరానికి చేరుకుంటుందట. ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు అనుభవిస్తూ నగేంద్ర భవనం చేరుకుంటుందట ఆత్మ. నగేంద్ర భవనం చేరుకున్న తర్వాత ఏం జరిగిందో చేరుకోవడానికి ఎంత నరకం అనుభవించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

నగేంద్ర భవనానికి ప్రయాణం: జీవుడు సౌరిపురాన్ని దాటిన తర్వాత, యమదూతలు అతడిని తాడులతో కట్టి అత్యంత వేగంగా లాగుతూ ఈ నగేంద్ర భవనం వైపు తీసుకువెళ్తారట. మనిషి మరణించిన మూడవ నెల ముగిసే సమయానికి జీవుడు ఇక్కడికి చేరుకుంటాడట. నగేంద్ర భవనం చేరుకునే దారి అంతా అడవులతో, భయంకరమైన కొండలతో నిండి ఉంటుందట. మార్గ మధ్యంలో రాళ్ళు, ముళ్ళు పాదాలను గుచ్చుకుంటూ రక్తస్రావం జరుగుతున్నా యమదూతలు కనికరించకుండా లాక్కెళ్తారట.

Advertisement

ఆత్మ అనుభవించే కష్టాలు: నగేంద్ర భవనానికి వెళ్లే దారిలో జీవుడు పడే బాధలు వర్ణనాతీతమట. యమదూతలు ముద్గరాలతో (ఇనుప గదలు) జీవుడిని వెనుక నుండి బాదుతూ ఉంటారట. జీవుడు భయంతో.. ఆకలితో వణికిపోతూ ఉంటాడట. నేను భూమిపై ఉన్నప్పుడు ఎందుకు పుణ్యకార్యాలు చేయలేదు? ఎందుకు దానధర్మాలు చేయలేదు? అని జీవుడు తనను తాను నిందించుకుంటూ ఏడుస్తాడట. ఈ ప్రాంతంలో విపరీతమైన చలి లేదా భరించలేనంత వేడి ఉంటుందట. ఆశ్రయం పొందేందుకు ఒక్క చెట్టు కూడా కనిపించని ఎడారి లాంటి దారుల్లో నడవాల్సి వస్తుందట.

ఆత్మకు వేసే శిక్షలు, పిండ భక్షణం: ఈ పట్టణంలో ప్రత్యేకంగా నరకకూపాలు ఉండవు కానీ, ప్రయాణంలో కలిగే అలసట మరియు ఆకలి అతిపెద్ద శిక్షలుగా పరిగణించబడతాయట. మరణించిన మూడు నెలల తర్వాత బంధువులు పెట్టే త్రైమాసిక శ్రాద్ధ పిండాన్ని జీవుడు ఈ నగేంద్ర భవనంలో భుజిస్తాడట. ఈ పిండాన్ని తిన్న తర్వాత జీవుడికి కొంచెం శక్తి వస్తుందట. కానీ, అది ముగిసిన వెంటనే యమదూతలు మళ్ళీ కఠినంగా ప్రవర్తించడం మొదలుపెడతారట. తన వారు పెట్టిన పిండాన్ని తింటున్నప్పుడు, తన కుటుంబ సభ్యులు పడుతున్న బాధను చూసి జీవుడు మరింత వేదనకు గురవుతాడట.

Advertisement

గరుడ పురాణంలోని ప్రేత కల్పం ప్రకారం మనిషి బ్రతికి ఉన్నప్పుడు చేసే దానాలు (ముఖ్యంగా పాదరక్షలు, ఛత్రం, అన్నదానం) ఈ యమలోక  ప్రయాణంలో కలిగే కష్టాలను తగ్గిస్తాయని చెప్పబడిందట.

NOTE: ఇక ఆత్మ తన యమలోక ప్రయాణంలో నాలుగవ పట్టణమైన గంధర్వపురానికి ఎలా చేరుకుంటుంది. ఎన్ని కష్టాలు, బాధలు అనుభవిస్తుంది. అక్కడ ఆత్మకు విధించే భయంకరమైన శిక్షలు ఏంటి..? అనే విషయాలు రేపటి కథనంలో తెలుసుకుందాం.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆత్మ నరకలోక ప్రయాణం – సౌరిపురం దారిలో స్వాగతం పలికే విషసర్పాలు, కౄరమృగాలు, భయానక దృశ్యాలు

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×