E-Paper
Advertisement

జర్మనీ పిల్ల ఫోటోకు కోహ్లీ లైక్‌..చెప్పు తెగుద్ది అంటూ హీరోయిన్ వార్నింగ్

జర్మనీ పిల్ల ఫోటోకు కోహ్లీ లైక్‌..చెప్పు తెగుద్ది అంటూ హీరోయిన్ వార్నింగ్
Advertisement

Ameesha Patel-Kohli:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 40% మ్యాచ్ లు పూర్తయ్యాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. జర్మనీకి సంబంధించిన ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్‌లాజ్ ( German influencer LizLaz ) అనే అమ్మాయికి సంబంధించిన హాట్ ఫోటో కు విరాట్ కోహ్లీ లైక్ కొట్టాడు. దీంతో వివాదం రాజుకుంది. అనుష్క శర్మ ఉండగా ఇలా విదేశీ అమ్మాయిల వెంట విరాట్ కోహ్లీ (Virat Kohli) పడుతున్నాడని, అతడు అంటే పడని వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. అతి త్వరలోనే అనుష్క శర్మకు విడాకులు ఇచ్చి, జర్మనీ అమ్మాయి లిజ్‌లాజ్ ని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ (Ameesha Patel) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె విరాట్ కోహ్లీకి సపోర్ట్ గా నిలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోటోకు లైక్ కొడితే తప్పేంటి ? అంటూ విరాట్ కోహ్లీని వెనుకేసుకు వచ్చింది అమీషా పటేల్. దీంతో అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Sam Billings: న‌మాజ్ చేయాల‌ని రిజ్వాన్ టార్చ‌ర్ చేస్తున్నాడు..డ్రెస్సింగ్ రూంలో న‌ర‌కం చూపిస్తున్నాడు

విరాట్ కోహ్లీకి సపోర్ట్ గా నిలిచిన పెళ్లికాని 50 ఏళ్ల హీరోయిన్

Advertisement

జర్మనీకి సంబంధించిన లిజ్‌లాజ్ అనే అమ్మాయి ఫోటోకు విరాట్ కోహ్లీ లైక్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కోహ్లీని విలన్ గా చూపిస్తూ కొంతమంది దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో విరాట్ కోహ్లీకి సపోర్ట్ గా నిలుస్తూ అమీషా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఫోటోకు లైక్ కొడితే ఇంత తప్పు పడతారా? ఫోటోకు లైక్ కొట్టే స్వేచ్ఛ కూడా విరాట్ కోహ్లీకి లేదా? అంటూ ప్రశ్నించారు అమీషా పటేల్. విరాట్ కోహ్లీ కూడా ఒక మనిషే.. అతనికి కొన్ని టేస్టులు ఉంటాయి.. అమ్మాయి ఫోటో నచ్చింది అందుకే లైక్ కొట్టాడని ఆమె వెల్లడించారు. కానీ ఒక్క ఫోటోకు లైక్ కొట్టాడని విరాట్ కోహ్లీని విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు అమీషా పటేల్. కొంతమంది కోహ్లీ అంటే పడని వాళ్ళు ఇలా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ చేసిన తప్పు లేదని.. అనుష్క శర్మ కూడా బాధపడకూడదని భరోసా కల్పించారు. చెత్త వాగుడు ఆపి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసి ఎంజాయ్ చేయండి అంటూ టోలర్స్ కు కౌంటర్ ఇచ్చారు అమీషా పటేల్.

గతంలోను విరాట్ కోహ్లీ పై ట్రోలింగ్

గతంలో కూడా ఇలాంటి స్క్రోలింగ్ ను విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి అవనీత్ కౌర్ ( Avneet Kaur) అనే అమ్మాయికి సంబంధించిన హాట్ ఫోటోకు విరాట్ కోహ్లీ లైక్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన గత ఏడాది చివరలో జరిగింది. అప్పుడు కూడా విరాట్ కోహ్లీని దారుణంగా ట్రోల్స్ చేశారు. అనుష్క శర్మను కాదని అవనీత్ కౌర్ వెంబడి పడుతున్నాడని విరాట్ కోహ్లీని ఆడుకున్నారు. కానీ ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు అలాంటి ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నాడు విరాట్ కోహ్లీ.

Advertisement

Also Read: Tanveer Ahemed: గిల్ బ్యాట్ల‌లో ర‌బ్బ‌ర్లు…అందుకే అవ‌లీలగా సిక్సులు, బౌండ‌రీలు కొడుతున్నాడు

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×