E-Paper
Advertisement

Parakamani: పరకామణి చోరీపై జగన్‌ కామెంట్స్‌ దుమారం

Parakamani: పరకామణి చోరీపై జగన్‌ కామెంట్స్‌ దుమారం
Advertisement

Parakamani:  తన గొయ్య తానే తవ్వుకోవడం అన్న చందంగా మారింది వైఎస్ జగన్ పరకామణి చోరీపై చేసిన కామెంట్స్. చోరీని చిన్న చోరీగా అభివర్ణించి..మాజీ ముఖ్యమంత్రి ఇంటా బయటా విమర్శలెదుర్కొంటారట. తిరుమల శ్రీవారిని తక్కువ చేసి చూపిస్తూ..భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ..వైఎస్ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందట. అసలే అధికారం పోయి…వైసీపీ నేతలు జైలు పోయి..పార్టీ …ప్రజల్లో దివాలా తీస్తున్న క్రమంలో..జగన్‌ వ్యాఖ్యలు పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్లుగా ఉందని ఫ్యాన్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట.

జగన్ కామెంట్స్ పై దుమారం

తిరుమల పరాకమణి కేసు కోర్టులో విచారణ జరుగుతున్ననేపథ్యలంలో వైఎస్ జగన్‌ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పరాకమణి చోరీ చాలా చిన్న చోరీ అంటూ మాట్లాడటం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. దొంగ కేవలం 9డాలర్లు చేశారని..అందుకే అతని నుంచి 14 కోట్లు విలువైన అస్తులను టీటీడీకి రాయించామని చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నెల 11కు కేసు విచారణ వాయిదా

Advertisement

2023లో వైసీపీ హయాంలో పరకామణిలో చోరీ చేస్తూ..జియ్యంగారి మఠం ఉద్యోగి రవికూమార్ పట్టుబడ్డాడు. ఆ తర్వాత లోక్‌ అదాలత్‌లో రాజీ కుదిర్చి.. అయన అస్తులను టీటీడీకి రాసిచ్చేలా చేశారు. మొత్తం 14 కోట్లను టీటీడీ రాయించుకుంది. ఈ చోరీ, రాజీ అయిన విషయాలు బయటకు రావడంతో.. అప్పట్లో సంచలంగా మారింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో హైకోర్టు సీఐడీ ఎంక్వైరీ వేసింది. అనంతరం విచారణ చేసిన సీఐడీ, ఏసీబీ హైకోర్టుకు నివేదిక సమర్పించాయి. విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుడు.. రాజీ అయిన అప్పటి AVSO సతీష్‌ కుమార్… తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ఎస్ వి సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డిలతో పాటు మొత్తం 35మందిని విచారించారు. అనంతరం 156 పేజీల నివేదికను సీఐడీ అధికారులు హైకోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై హైకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేసు విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది హైకోర్టు.

పరకామణి చోరీపై వివాదాస్పద వ్యాఖ్యలు

అయితే ఉన్నట్లుండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి..పరకామణిపై సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరకామణి కేసును చాలా చిన్నది అంటూ మాట్లాడారు. కేవలం 9 డాలర్లు..వాటి విలువ 72 వేలే ఉంటుందంటూ దొంగను సమర్ధించేట్లుగా చెప్పారు. అంతేకాదు…దొంగ నుంచి 14కోట్ల అస్తులను టీటీడీకి రాయించామని గుర్తు చేశారు. అసలు పరకామణిలో చోరీని కనిపెట్టింది తమ హాయంలోనే అని..అంతకు ముందు నిరంతరం చోరీలు జరగాయంటూ ఒక్కసారిగా బాంబ్ పేల్చారు. ఇక పులివెందుల పర్యటనలో అయితే ఏకంగా అదేదో గుడి అంటు తిరుమల ఆలయం, తిరుమల శ్రీవారిని అవమానించే విధంగా మాట్లాడటం వివాదంగా మారింది.

జగన్ వ్యాఖ్యలతో వైసీపీకి డ్యామేజీ

Advertisement

పరకామణి కేసులో వైఎస్ జగన్.. తిరుమల శ్రీవారిని, భక్తులను అవమానించే విధంగా మాట్లాడటం ఇప్పుడు వైసీపీ డ్యామేజీ చేసే విధంగా ఉన్నాయని ఆ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారట. కేసు కోర్టులో ఉండగా…ఇప్పుడు దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఏముందని అధినేతనే ప్రశ్నిస్తున్నారట. కొందరు వైసీపీ నేతలు..పరకామణి విషయంలో వైఎస్‌ జగన్‌ను తప్పుదోవ పట్టించారని మండిపడుతున్నారట. పరకామణి కేసుపై వివాదాస్పద వ్యాఖ్యలు..కూటమి పార్టీకి అస్త్రాలుగా మారాయని చర్చించుకుంటున్నారట.

జగన్‌కు భక్తి లేదు.. భయం లేదు

జగన్ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ నేతలతో పాటు..హిందువాదుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందట. శ్రీవారు అంటే..జగన్‌కు భక్తి లేదు..భయమూ లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారట. భవిష్యత్‌లో ఆలయంలో చోరీ చేస్తే..వైసీపీ నేతలే రాజీలు చేయించి కేసులు లేకుండా చేస్తారని బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారట. పరకామణిని చోరీని చిన్న చోరీ అంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు సెల్ఫ్‌గోల్‌ అని అనుకుంటున్నారట.

మొత్తానికి పరకామణి ఇష్యూ వైసీపీని డ్యామేజీ చేసే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోర్టు కేసులో ఉండగా.. జగన్‌ ఈ అంశం గురించి అనవసరంగా మాట్లాడి.. పార్టీని మరింత అగాధంలో పడేశారనుకుంటున్నారట. మరి జగన్ వ్యాఖ్యలు వైసీపీకి ఇంకెంత నష్టాన్ని కలిగిస్తాయో..ఈ నష్టాన్ని అధినేత ఎలా పూడ్చుకుంటాడో…వేచి చూడాలి.

Story by Kishan, Big Tv 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×