E-Paper
Advertisement

JanaNayagan : భగవంత్ కేసరి రీమేక్ అని కన్ఫర్మ్ అయినట్లే, ఆ పాత్రలో గౌతమ్ వాసుదేవ్

JanaNayagan : భగవంత్ కేసరి రీమేక్ అని కన్ఫర్మ్ అయినట్లే, ఆ పాత్రలో గౌతమ్ వాసుదేవ్
Advertisement

JanaNayagan : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో తమిళ్ ఫిల్ ఇండస్ట్రీలో ఇళయ దళపతి విజయ్ కు అంత క్రేజ్ ఉంది. కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా అతనికి మంచి మార్కెట్ ఉంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.

ఆ తర్వాత వచ్చిన తుపాకీ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. ఆ రెండు సినిమాలకు మినహాయిస్తే మరో తెలుగు సినిమా ప్రమోషన్స్ కి విజయ్ హాజరు కాలేదు. అయితే విజయ్ సినిమాలను మాత్రం ఇక్కడ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. విజిల్, లియో వంటి సినిమాలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఇక ప్రస్తుతం జననాయగన్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్.

భగవంత్ కేసరి రీమేక్

Advertisement

విజయ్ తన కెరీర్ లో ఎన్నో రీమేక్ సినిమాలు చేశాడు. మహేష్ బాబు చేసిన ఒక్కడు పోకిరి వంటి సినిమాలను తమిళ్లో విజయ్ రీమేక్ చేశాడు. ఇకపోతే ఇప్పుడు చేస్తున్న జననాయగన్ అనే సినిమా భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని తెలుస్తుంది.

ఇప్పటివరకు ఈ సినిమా రీమేక్ అని ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. అలానే పాట లో కూడా కొన్ని బాలకృష్ణ సినిమాకు సంబంధించిన లక్షణాలు కనిపించాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో గౌతమ్ మీనన్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

Advertisement

గౌతమ్ మీనన్ కూతురుగా మమిత కనిపిస్తుంది. అయితే అనుకోకుండా గౌతమ్ చనిపోవడం వలన వాళ్ళ కూతుర్ని పెంచి పెద్ద చేసే బాధ్యత విజయ్ తీసుకుంటారు అని సమాచారం వినిపిస్తుంది. అయితే దాదాపు భగవంత్ కేసరి సినిమాలో ఇదే కథ ఉంటుంది. కాకపోతే గౌతమ్ మీనన్ పాత్రను ఇక్కడ శరత్ కుమార్ ప్లే చేశారు.

అఫీషియల్ గా చెప్పలేదు 

గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈవెంట్ లో వీటివి గణేషన్ స్టేజ్ పైన మాట్లాడుతూ విజయ్ సార్ అనిల్ రావిపూడి ని పిలిచి కథ చెప్పమన్నారు అంటూ ఏదో చెప్పబోయారు. అయితే వెంటనే అనిల్ రావిపూడి స్టేజ్ ఎక్కి అది మాట్లాడకుండా ఆపేశారు. వీటివి గణేష్ చెప్పే ప్రయత్నం చేసినా కూడా అది జరగలేదు. అయితే మొత్తానికి ఆదంతా కూడా భగవంతు కేసరి సినిమా గురించిన టాపిక్ అని ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. అయితే జననాయగన్ అనే సినిమా భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని ఇప్పటివరకు కూడా అనౌన్స్ చేయలేదు.

Also Read : Peddi: వాయిదా పడ్డ రామ్ చరణ్ పెద్ది? పెద్ద సినిమాలకు తప్పని ఇబ్బందులు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×