E-Paper
Advertisement

AP Politics: వైసీపీలో భారీ కుదుపు.. ఛైర్మన్‌తో ఆరుగురు ఎమ్మెల్సీలు భేటీ, రాజీనామాలు ఆమోదించాల్సిందే?

AP Politics:  వైసీపీలో భారీ కుదుపు.. ఛైర్మన్‌తో ఆరుగురు ఎమ్మెల్సీలు భేటీ, రాజీనామాలు ఆమోదించాల్సిందే?
Advertisement

AP Politics: శాసనమండలిలో వైసీపీ బలం తగ్గిపోనుందా? శాసనసభలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన ఆ పార్టీ, మండలిలోనూ పట్టు కోల్పోతుందా? రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్సీలపై ఛైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? న్యాయస్థానం ఆదేశాలపై వైసీపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఇవే ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి.

హైకోర్టు ఆదేశాలు.. ఛైర్మన్‌ని కలిసిన వైసీపీలు

Advertisement

ఏపీలో అధికారం పోయిన తర్వాత మండలిలో తమ వాదన బలంగా వినిపించింది వైసీపీ. ఇప్పుడు మండలిలో ఆ పార్టీకి బలం తగ్గిపోనుంది. బహుశా ప్రతిపక్ష హోదా పోయే అవకాశం ఉందనే వార్తలు లేకపోలేదు. వైసీపీకి చెందిన జయమంగళ వెంకటరమణ తన రాజీనామాను ఆమోదించాలని ఛైర్మన్ మోషేన్‌రాజును పదే పదే కోరారు.

ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నేరుగా హైకోర్టుని ఆశ్రయించారు. సదరు ఎమ్మెల్సీ వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. దీనిపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని మండలి ఛైర్మన్ మోషేన్‌రాజుని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో సోమవారం రాజీనామాపై చర్చించేందుకు రావాలని జయమంగళ వెంకటరమణకు సమాచారం ఇచ్చారు ఛైర్మన్.

Advertisement

నాలుగు వారాల్లో నిర్ణయం.. వైసీపీ ఖాళీ ఖాయమా?

అనుకున్నట్లుగానే ఆయన ఛైర్మన్‌తో సమావేశమయ్యారు. అదే సమయంలో వైసీపీకి రాజీనామా చేసిన మరో ఐదుగురు ఎమ్మెల్సీని ఛైర్మన్‌తో భేటీ అయ్యారు. తమ రాజీనామాలను ఆమోదించాలని ఈ సందర్భంగా కోరారు. వారిలో కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ రెడ్డి, జానియా ఖానం ఉన్నారు.

సభ్యుల రాజీనామాలపై ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం ఉదయం మండలి ఆవరణలో మాట్లాడిన జయమంగళ వెంకటరమణ, మా ఫాదర్ మాజీ ఆర్మీ అధికారని, తనకు ఎథిక్స్ ఉన్నాయని అన్నారు. మరో పార్టీలో చేరిన తాను వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగడానికి సిద్ధంగా లేనని తేల్చేశారు.

ALSO READ: వైజాగ్ కు కొత్త కిరీటం.. ఆకాశంలో నడిచే మరొక అనుభూతి

గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఈ విధంగా పార్టీ మారారని అన్నారు. వైసీపీ నుంచి ఎన్నికై కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కొనసాగలేనని మనసులోని మాట బయటపెట్టారు జయమంగళ వెంకట రమణ. ఆరుగులు ఎమ్మెల్సీల రాజీనామాలపై చర్యలు తీసుకుంటే వారంతా కూటమిలో చేరే అవకాశం ఉంది. వీరి తర్వాత ఇంకెంతమంది రాజీనామా చేస్తారేమోనని కంగారు పడుతోంది వైసీపీ.

ఇప్పటికే చాలామంది ఎమ్మెల్సీలు కూటమి పార్టీలతో టచ్‌లోకి వెళ్లినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అదే జరిగితే మండలిలో వైసీపీ బలంగా పూర్తిగా తగ్గిపోనుంది. ఈ నేపథ్యంలో రాజీనామాలు ఆమోదించలేదన్న వాదన లేకపోలేదు. ఎమ్మెల్సీ దారిలో ఎమ్మెల్యేలు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లు ఇంకోవైపు వార్తలు జోరందుకున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×