// // Samantha-Raj Nidimoru- రాజ్‌నిడిమోర్‌ భార్యకి విడాకులిచ్చాడా? -->
E-Paper
Advertisement

Samantha-Raj Nidimoru: సమంతతో పెళ్లి.. ఇంతకి రాజ్‌నిడిమోర్‌ భార్యకి విడాకులిచ్చాడా?

Samantha-Raj Nidimoru: సమంతతో పెళ్లి.. ఇంతకి రాజ్‌నిడిమోర్‌ భార్యకి విడాకులిచ్చాడా?
Advertisement

Samantha-Raj Nidimoru: స్టార్‌ హీరోయిన్‌ సమంత రెండో పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీ మ్యాన్‌ డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరును ఇవాళ (డిసెంబర్‌ 1) పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని ఆఫిషియల్‌ చెప్పలేదు. కానీ, ఇవాళ కొయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌తో సమంత–రాజ్‌ నిడిమోర్‌ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారని ఇండస్ట్రీలో వర్గాలు అంటున్నాయి. అంతేకాదు సమంత–రాజ్‌ పెళ్లి చేసుకుంటున్న ఫోటో కూడా లీకైంది. ఇక్కడ సమంత రెడ్‌ డ్రెస్‌లో వేసుకుని ఉండగా.. రాజ్‌ నిడిమోరు క్రీం కలర్‌ షర్ట్‌, బ్లూ జీన్స్‌లో కనిపించారు.

కోయంబత్తూరులో పెళ్లి?

Advertisement

ఇప్పటికే వీరి పెళ్లి కూడా అయిపోయినట్టు సన్నిహిత వర్గాల నుంచి గట్టి సమాచారం. కొంతకాలంగా సమంత–రాజ్‌ నిడిమోర్‌లు రిలేషన్‌పై తెగ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సామ్‌ నిర్మించిన శుభం మూవీ నుంచి వీరిద్దరి సన్నిహితంగా మెదులుతున్నారు. వెకేషన్స్‌కి, మూవీ ఈవెంట్స్‌కి జంటగా వెళుతూ తమ రిలేషన్‌పై హింట్‌ వస్తున్నారు. ఇటవల ఓ మూవీ ఈవెంట్‌లో సమంత, రాజ్‌ని హత్తుకుని ఉన్న ఫోటో షేర్‌ చేసింది. దీంతో వీరిద్దరి రిలేషన్‌ ఉన్నారని అంతా కన్‌ఫాం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమయాణం గురించి ఎన్ని వార్తలు వస్తున్న స్పందించలేదు. దీంతో సమంత–రాజ్ ఇద్దరు రిలేషన్‌ నిజమే అన్నది కన్‌ఫాం చేసేసుకున్నారు నెటిజన్స్‌.

కొంతకాలంగా రిలేషన్..

ఇప్పుడు పెళ్లితో అది ఆఫీషియల్‌ అయిపోయింది. వీరిద్దరి రిలేషన్, రాజ్‌-సమంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్‌ చేసినప్పడల్లా రాజ్ నిడిమోర్‌ భార్య శ్యామాలి డే వారిద్దరిని ఉద్దేశిస్తూ పరోక్షంగా స్పందిస్తూ ఉంటుంది. క్రిప్టిక్‌ పోస్టులు పెడుతూ వీరిద్దరిపై ఇన్‌డైరెక్టర్‌గా కౌంటర్‌ ఇస్తూ వస్తుంది. అంతేకాదు ఎక్కువగా శాపానార్థాలు పెట్టినట్టుగా ఉండే కామెంట్స్‌ ఉండటంతో అవి సమంతని ఉద్దేశించేనని అంత అభిప్రాయపడుతుండేవారు. ఇలా శ్యామాలీ పోస్ట్స్‌ ఓ వైపు.. రాజ్‌-సమంత రిలేషన్‌ నేపథ్యంలో వారి విడాకులపై ఆసక్తి నెలకొంది.

Advertisement

Also Read: Samantha:సమంత రెండో పెళ్లిపై గందరగోళం.. అది పెళ్లా? పూజా?

2022లోనే భార్యకు విడాకులు

ఇప్పుడు సమంత–రాజ్‌ నిడిమోరు పెళ్లంటూ వార్తలు రావడంతో ఇంతకి రాజ్‌ నిడిమోరు భార్యకు విడాకులు ఇచ్చాడా? అనే సందేహం అందరిలో మొదలైంది. అయితే రాజ్ నిడిమోరు–శ్యామాలి డే విడాకులు జరిగి మూడేళ్లు అవుతుంది. బాలీవుడ్‌ మీడియా ప్రకారం… వీరిద్దరి 2022లో విడాకులు తీసుకుని విడిపోయినట్టు తెలుస్తోంది. కాగా రాజ్‌ నిడిమోరు–శ్యామాలి డే పెళ్లి 2015లో పెద్ద సమక్షంలో జరిగింది. అప్పటి నుంచి అన్యోన్యంగా జీవిస్తున్న వారిమధ్య కలతలు రావడంతో 2022లో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి రాజ్‌, సమంతతో సన్నిహితం కాస్తా ప్రేమ మారింది. కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు నేడు 2025 డిసెంబర్‌ 1న సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×