E-Paper
Advertisement

AP News: దుప్పిని చంపి.. వండుకు తిన్న వైసీపీ నేతలు!.. ఏపీలో కలకలం..

AP News: దుప్పిని చంపి.. వండుకు తిన్న వైసీపీ నేతలు!.. ఏపీలో కలకలం..
Advertisement

AP News: అధికార వైసీపీ నేతలు చుక్కల దుప్పిని చంపి విందు చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దారి తప్పి జనారణ్యంలోకి వచ్చిన ఓ దుప్పి నేతలకు ఆహారమైంది.

అరుదైన చుక్కల దుప్పిని చంపి ఆరగించిన సంఘటన యర్రవారిపాలెం మండలం వీఆర్ అగ్రహారంలో చోటుచేసుకుంది. శేషాచల అటవీ ప్రాంతం నుంచి దుప్పి గ్రామంలోకి వచ్చి చేరింది. పంటపొలాల్లో సంచరిస్తుండగా గమనించిన వైసీపీ కార్యకర్తలు.. కుక్కతో దాడి చేయించి చంపేశారు. ఆ తర్వాత దుప్పి మాంసంతో విందు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

దుప్పిని పట్టుకుంటున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం బయటకొచ్చింది. ఆ వీడియో ఆధారంగా నిందితులను తేల్చే పనిలో పడ్డారు ఫారెస్ట్ అధికారులు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితులు వైసీపీకి చెందిన మాజీ సర్పంచి చంద్ర, కృష్ణయ్య, నాగేశ్వరరావు, చిన్నబ్బ లతో పాటు పలువురు మహిళలు కూడా ఉన్నట్టు గుర్తించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×