E-Paper
Advertisement

Psycho Killer: బండరాయితో కొట్టి చంపే సైకో కిల్లర్ అరెస్ట్.. సీసీఫూటేజ్‌లో షాకింగ్ విజువల్స్..

Psycho Killer: బండరాయితో కొట్టి చంపే సైకో కిల్లర్ అరెస్ట్.. సీసీఫూటేజ్‌లో షాకింగ్ విజువల్స్..
Advertisement
psycho killer

Psycho Killer: వాడో సైకో. సైకో అంటే సైకోనే. ఫుల్‌గా తాగుతాడు. తాగిన మైకంలో దారుణాలకు తెగబడుతాడు. రోడ్లు, వీధుల వెంట నిద్రిస్తున్న వారే అతని టార్గెట్. నిద్రలో ఉన్న వారిని.. బండరాయితో బాది దారుణంగా చంపుతున్నాడు. అలా ఇద్దరు మహిళలను కొట్టి చంపాడు.

వరుస హత్యలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సమీపంలోని సీసీకెమెరా దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. ఉన్మాదిగా మారిన ఆ నిందితుడు.. బండరాయితో కొట్టి కొట్టి చంపే దృశ్యాలు చూట్టానికే దారుణంగా ఉన్నాయి. చంపింది అంకమ్మరావుగా గుర్తించారు.

Advertisement

పల్నాడు జిల్లాలో వరుస హత్యల కేసుల్లో నిందితుడిని నరసారావుపేట పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరా విజువల్ లో బయటపడ్డ సైకో హత్యల వ్యవహారం బయటకొచ్చింది. నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులను బండ రాయితో కొట్టి చంపాడు. ఈ హత్యలన్నీ చేసింది సైకో అంకమ్మరావుగా పోలీసులు ధ్రువీకరించారు.

ఇటీవల నరసరావుపేట కూరగాయల మార్కెట్ దగ్గర నిద్రిస్తున్న వృద్ధురాలుని ఇదే తరహాలో హత్య చేశాడు. గత ఏడాది జూన్‌లో నరసరావుపేటకి చెందిన మహిళను ఇలానే కొట్టి చంపాడు. అంకమ్మరావుపై మొత్తం 11 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతనిపై మర్డర్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×