E-Paper
Advertisement

YSRCP : అధికారమే అండగా.. రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు..

YSRCP : పల్నాడు జిల్లా క్రోసూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కుమారుడు కల్యాణ్ ఆధ్వర్యంలో ఈ భీభత్సం జరిగింది. వైసీపీ పార్టీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని కంచేటి సాయి కోసం గాలించారు. ఈ క్రమంలో సాయి అనుచరుడు కె.రాము కన్సల్టెన్సీ ఆఫీసుపై దాడి చేశారు. ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. వైసీపీ శ్రేణుల తీరుతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారమే అండగా ఎమ్మెల్యే అనుచరులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ తతంగాన్ని పట్టించుకోకుండా క్రోసూరు పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారనే ఆరోపనలు ఉన్నాయి.

క్రోసూరు లో ఏం జరిగిందంటే..? వైసీపీ బహిష్కృత నేత సాయి.. పెదకూరపాడు ఎమ్మెల్యే అవినీతిపై నియోజకవర్గ ప్రజలకు వివరించేందుకు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి వస్తున్న సాయిని బెల్లంకొండ వద్ద వాహనాలు అడ్డుపెట్టి పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

క్రోసూరులో మీడియా సమావేశం పెట్టొద్దని ఆంక్షలు విధించారు. అనంతరం కంచేటి సాయి మీడియాతో మాట్లాడుతూ… పెదకూరపాడులో వైసీపీ అవినీతిపై చర్చించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు మీడియా సమావేశాలు పెట్టకుండా పోలీసుల సాయంతో అధికార పార్టీ అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు. సాయి క్రోసూరు వచ్చారని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు బీభత్సం సృష్టించారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×