// // Jagan: జగన్ స్కెచ్ మామూలుగా లేదు.. వేర్వేరుగా ప్రయత్నాలు -->
E-Paper
Advertisement

Jagan: జగన్ స్కెచ్ మామూలుగా లేదు.. అదే ఇష్యూ, కాకపోతే వేర్వేరుగా ప్రయత్నాలు

Jagan: జగన్ స్కెచ్ మామూలుగా లేదు.. అదే ఇష్యూ, కాకపోతే వేర్వేరుగా ప్రయత్నాలు
Advertisement

Jagan: మాజీ సీఎం జగన్ రూటు మార్చారా? 2029లో అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారా? కూటమిని విడగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారా? అన్నికోణాల్లో అస్త్రాలు ఎక్కుపెట్టారా? ఏపీలో శాంతి భద్రతల ఇష్యూని పదే పదే తెచ్చి కూటమిలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేశారా? అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు.

జగన్ భద్రతపై కేంద్ర హోం శాఖకు వైసీపీ ఫిర్యాదు

Advertisement

ఏపీలో అధికారం పోయిన నుంచి రెండు అంశాలపై సుదీర్ఘంగా ఫైట్ చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. తనకు ప్రతిపక్ష నేత ఇవ్వాలన్నది, సెక్యూరిటీ ఇంకా పెంచాలన్నది మరొకటి. ఈ రెండింటిపై ఆ పార్టీ నేతలు హైకోర్టు తలుపు తట్టారు. జగన్ సెక్యూరిటీ గురించి ఎ టు జెడ్ డీటేల్స్ ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఆ పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు. ప్రతిపక్ష అంశం అనేది న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది.

జగన్ ఎక్కడకు వెళ్లినా అడుగడుగునా సెక్యూరిటీ ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి మాదిరిగా భద్రత ఉండాలని ఆయన ఆలోచన. అధినేత కోరికపై ఆ పార్టీ నేతలు హైకోర్టు, కేంద్రాన్ని సంప్రదిస్తున్నా ఎలాంటి ఫలితం లేదు. హోదా ఒక్కటే లేదుగానీ ప్రతి పక్షనేతగా ఉండాల్సిన సెక్యూరిటీ ఇస్తున్నట్లు ఆ మధ్య ప్రభుత్వం తెలిపింది.

Advertisement

జగన్ కాన్వాయ్‌ని ప్రమాదకరంగా మళ్లించారన్న రఘురాం

ఇదే అంశంపై మరోసారి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నేత తలశిల రఘురాం. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా ఆయన భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేశారని పేర్కొన్నారు. జగన్ కాన్వాయ్‌ని ప్రమాదకరంగా మళ్లించారని పేర్కొన్నారు. జగన్ పర్యటనలో 22 కిలోమీటర్ల దూరాన్ని 47 కిలోమీటర్ల వరకు తిప్పడాన్ని అందులో ప్రస్తావించారు. జగన్ భద్రత విషయంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా ఉందని ఫిర్యాదు ప్రస్తావించారు.

వైసీపీ ఫిర్యాదు వెనుక ఏపీలో శాంతి భద్రతలు లేవన్నది అసలు కారణం. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి జగన్ సహా ఆ పార్టీ నేతలు పదే పదే శాంతి భద్రతల ఇష్యూని ప్రస్తావిస్తున్నారు. జగన్ పరామర్శలకు వెళ్లినప్పుడు పోలీసులు ఆంక్షలు పెడితే కావాలనే అడ్డుకుంటున్నారని రాద్ధాంతం చేస్తున్నారు.

ALSO READ: అసెంబ్లీకి జగన్.. తిరుమల కల్తీ నెయ్యిపై స్పందిస్తారా?

రీసెంట్‌గా అంబటి ఇంటికి జగన్ వెళ్లినప్పుడు జాతీయ రహదారిపై గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డంతా జగన్ కాన్వాయ్, ఆ పార్టీ నాయకుల వాహనాలు, యువత బైక్ ర్యాలీతో గంటల కొద్దీ ప్రజలు నరకయాతన అనుభవించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఇదే పరిస్థితి అంటూ చాలామంది మండిపడ్డారు కూడా.

దీంతో జోగి రమేష్ ఇంటికి వెళ్లినప్పుడు జగన్ కాన్వాయ్‌ని మరోవైపు టర్న్ చేశారని అంటున్నారు. అసలు నేతల వద్దకు వెళ్లినప్పుడు ఎన్నికల ప్రచారం మాదిరిగా వెళ్లడం ఏంటని అధికార పార్టీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.  అధికారంలో లేకపోయినా అవే సదుపాయాలు కోరడాన్ని కూటమి నేతలు తప్పుబడుతున్నారు. ఏదో విధంగా కూటమిని విడగొట్టడం లేకుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నారు అంటున్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×