E-Paper
Advertisement

blue turmeric: అసలు ఏంటి ఈ బ్లూ టర్మరిక్? మనకు తెలిసిన పసుపు కంటే ఇది భిన్నమైందా?

blue turmeric: అసలు ఏంటి ఈ బ్లూ టర్మరిక్? మనకు తెలిసిన పసుపు కంటే ఇది భిన్నమైందా?
Advertisement

blue turmeric: సాధారణంగా మనందరికీ పసుపు అనగానే ముందుగా గుర్తొచ్చేది వంటింట్లో ఉండే పసిడి రంగు పసుపే. కానీ, మనకు తెలిసిన పసుపు కాకుండా అచ్చం నీలం రంగులో ఉండే ‘బ్లూ టర్మరిక్ (దీన్నే నల్ల పసుపు అని కూడా అంటారు) గురించి మీకు తెలుసా? చాలా తక్కువ మందికే దీని గురించి తెలుసు. దీని శాస్త్రీయ నామం Curcuma caesia. ఇది లోపల నీలం లేదా నలుపు రంగులో ఉండి, కర్పూరం లాంటి ఘాటైన వాసనతో భలే వెరైటీగా ఉంటుంది. ఈ క్రమంలో నల్ల పసుపు వల్ల కలిగే ప్రయోజనాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణ పపుసుకి దీనికి ఉన్న తేడా?

మనం రోజూ వంటల్లో వాడే పసుపులో ‘కుర్కుమిన్’ ఎక్కువగా ఉండటం వల్ల దానికి మంచి రంగు వస్తుంది. కానీ, ఈ నీలి పసుపు వంటల కోసం వాడేది కాదు. దీనిలో కుర్కుమిన్ తక్కువగా ఉన్నా.. ఎసెన్షియల్ ఆయిల్స్, ఫెనోలిక్ కాంపౌండ్స్ లాంటి పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. రుచికి కాస్త చేదుగా ఉన్నా, ఇందులో ఔషధ గుణాలు మాత్రం మెండుగా ఉంటాయి.

Advertisement

Also Read: తియ్యని సపోటాతో బోలెడన్ని లాభాలు.. కానీ ఆ వ్యాధి ఉన్నవారు మాత్రం అస్సలు తినకూడదు!

కీళ్ల నొప్పులకు చెక్..

మన మామూలు పసుపు లాగే.. ఇది కూడా ఒళ్లు నొప్పులు, వాపులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో ఇబ్బంది పడేవారికి ఆయుర్వేదంలో దీనిని ఒక గొప్ప మందుగా చెబుతారు. లోపలి నుంచి నొప్పిని లాగేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ బ్లూ టర్మరిక్‌లో చాలా ఉన్నాయి.

శ్వాసకోశ ఆరోగ్యానికి..

Advertisement

కడుపులో గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలు ఉంటే బ్లూ టర్మరిక్ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాదు.. జలుబు లేదా దగ్గు వేధిస్తున్నప్పుడు శ్వాస ఇబ్బందులను తగ్గించడానికి పాతకాలం నుంచి దీనిని వాడుతున్నారు. శరీరంలోని మలినాలను బయటకు పంపి, మనల్ని ఆరోగ్యంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు కూడా దీనిలో ఎక్కువగా ఉంటాయి.

చర్మ సంరక్షణకు..

చర్మంపై చిన్న చిన్న కోతలు పడినా, గాయాలైనా లేదా దురదగా అనిపించినా ఈ నీలి పసుపు పేస్ట్‌ను రాస్తుంటారు. దీంతో ఇన్ఫెక్షన్లు నుంచి రక్షణ పొందవచ్చు. అయితే, ఇది కేవలం ఔషధాల కోసం వాడేది కాబట్టి.. గర్భిణీ స్త్రీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నీలి పసుపును వాడేముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Also Read: బరువు పెరుగుతున్నారా? పీరియడ్స్ సరిగ్గా రావడం లేదా? అయితే మీలో ఈ సమస్య ఉన్నట్టే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×