E-Paper
Advertisement

Ysrcp : సొంత పార్టీ నాయకుడి హత్యకు వైసీపీ కుట్ర!

Ysrcp : సొంత పార్టీ నాయకుడి హత్యకు వైసీపీ కుట్ర!
Advertisement

ఏపీ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా సొంత పార్టీ నాయకుడి హత్యకు వైసీపీ కుట్ర చేసిందని రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలకు పడటం లేదని, దీంతో అందులో ఒకరిని తప్పించడానికి కుట్రలు జరుగుతున్నాయని మరో కీలక నేత ఆరోపించడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది.ఇంతకు ఆ కీలక నేత ఎవరు? ఆయన్ను ఎందుకు చంపడానికి కుట్ర జరుగుతున్నదని ఎందుకు ఆరోపించారు? మరి దీనిపై వైసీపీ అధిష్టానం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదు అనే ప్రశ్నలు సామాన్యుల్లో రేకెత్తుతున్నాయి.

నాకు ఏమైనా అయితే వారే కారణం..

వైఎస్సాసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల మాట్లాడుతూ.. తన హత్యకు కుట్ర జరుగుతోందని పెద్దఎత్తున ఆరోపణలు చేశారు. తన హ్యతకు కుట్ర చేసిన వారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. సొంత పార్టీ నేతను అంతమొందించేందుకు వైసీపీ కుట్ర చేస్తున్నదని తెలుగుతమ్ముళ్లు సైతం ఆరోపిస్తున్నారు. గతంలో అధికారంలోకి రావడానికి సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని నరికి చంపించిన జగన్‌కు హత్యారాజకీయాలు కొత్తేమీ కాదని మరికొందరు ఆరోపిస్తున్నారు. అసలు దువ్వాడ శ్రీనివాస్, ధర్మానకు మధ్య గల శత్రుత్వం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.

అవినీతిపై ప్రశ్నించినందుకే..

Advertisement

ఏపీలో దువ్వాడ శ్రీనివాస్ చాలా సౌమ్యుడిగా మారిపోయాడు. దివ్వెల మాధురి పరిచయంతో అటు కుటుంబాన్ని దూరం చేసుకుని ఆమెతో కలిసి ఉండటం, ప్రత్యేకంగా వీడియో షూట్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన వైరల్ అయ్యారు. ఆయన చర్యల వలన పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావించిన వైసీపీ పెద్దలు ఆయన్ను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన జగన్‌కు సన్నిహితుడైన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనికి తోడు మాధురి, కింజరాపు అప్పన్నల మధ్య జరిగిన సంభాషణ బయటకు వచ్చింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, ఆ ఆడియోలోని మాటలు వాస్తవమేనని కృష్ణ దాస్ చెప్పడంతో దువ్వాడ అగ్రెసివ్ అయ్యారు.

 

Advertisement

హైదరాబాద్ నుంచి టెక్కలి వెళ్తున్న సమయంలో తనపై దాడి చేసేందుకు ధర్మాన కృష్ణదాస్ కుట్ర చేశారంటూ ఆరోపించారు. అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వద్ద హైవేపై కారు ఆపి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. తానుభయపడే వ్యక్తిని కాదని దువ్వాడ చెప్పారు. అయితే, దువ్వాడ వ్యాఖ్యలపై ధర్మాన కృష్ణదాస్ సైతం స్పందించారు. తాను దువ్వాడ జోలికి వెళ్లడం లేదని స్పష్టంచేశారు. తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం వల్లే తమ వాళ్లు కాస్త ఘాటుగా స్పందించారని పేర్కొన్నారు. అంతకుమించి తమకు రాజకీయ శత్రుత్వం ఏది లేదని ధర్మాన క్లారిటీ ఇచ్చారు. దువ్వాడ, ధర్మాన మధ్య ముదురుతున్న ఈ విషయంపై జగన్ జోక్యం చేసుకోవాలని దువ్వాడ శ్రేణులు కోరుతుండగా.. అసత్య ఆరోపణలు చేసి పార్టీ పరువుతీస్తున్న దువ్వాడను పార్టీ నుంచి బహిష్కరించాలని ధర్మాన కేడర్ డిమాండ్ చేస్తున్నది.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×