E-Paper
Advertisement

Chinese Manja: సంక్రాంతి రాకముందే మృత్యుఘంటికలు.. చైనా మాంజాతో ఇద్దరి గొంతు కోత!

Chinese Manja: సంక్రాంతి రాకముందే మృత్యుఘంటికలు.. చైనా మాంజాతో ఇద్దరి గొంతు కోత!
Advertisement

Chinese Manja: సంక్రాంతి పండుగ ఇంకా రాకముందే నగరంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. నిషేధిత ‘చైనా మాంజా’ వాహనదారుల పాలిట యమపాశంగా మారుతోంది. సరదా కోసం ఎగురవేస్తున్న గాలిపటాలు.. అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల జరిగిన రెండు ఘటనల్లో యువకులు తీవ్రంగా గాయపడటం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.

పాతబస్తీలో ఇంటర్ విద్యార్థికి గాయాలు:

పాతబస్తీ షాలిబండా పరిధిలోని షంషీర్‌గంజ్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం జమీల్ అనే ఇంటర్ విద్యార్థి బైక్‌పై వెళ్తుండగా మాంజా మెడకు తగిలింది. దీంతో అదుపుతప్పి కిందపడిపోగా.. గొంతు కోసుకుపోవడంతో పాటు మెడ, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. దక్షిణ మండలం డీసీపీ కిరణ్ కారే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కీసరలో యువకుడికి 19 కుట్లు:

Advertisement

మొన్నటికి మొన్న కీసరలోని మల్లికార్జున నగర్‌లో చైనా మాంజా సృష్టించిన బీభత్సం మనకు తెలిసిందే. జశ్వంత్ రెడ్డి అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా, గాలిలో ఎగురుతూ వచ్చిన నైలాన్ మాంజా మెడకు చుట్టుకోవడంతో గొంతు భాగం తీవ్రంగా తెగిపోయింది. గాయం లోతుగా ఉండటంతో వైద్యులు అతడికి ఏకంగా 19 కుట్లు వేయాల్సి వచ్చింది. దారం ఇంకొంచెం లోతుగా దిగి ఉంటే ప్రాణానికే ముప్పు వాటిల్లేదని వైద్యులు ధృవీకరించిన ఈ ఘటన.. చైనా మాంజా తీవ్రతకు అద్దం పడుతోంది.

చైనా మాంజా అమ్మకం, వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ వ్యాపారులు దొంగచాటుగా విక్రయిస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేశామన్నారు. పండుగ వేళ తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ దారం వాడుతున్నారో గమనించాలని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Read Also: CM Revanth Reddy Chit Chat: ఆ విషయాలు కేసీఆర్‌ని అడగండి.. మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×