E-Paper
Advertisement

YSRCP: సంక్రాంతి ముసుగులో ‘కేసినో’ దందా.. కోడిపందేల బరిలో ఘర్షణలపై వైసీపీ ఫైర్!

YSRCP: సంక్రాంతి ముసుగులో ‘కేసినో’ దందా.. కోడిపందేల బరిలో ఘర్షణలపై వైసీపీ ఫైర్!
Advertisement

YSRCP: కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం పందెం రాయుళ్లకు వత్తాసు పలుకుతోందని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది.

బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో నిర్వహిస్తున్న కోడిపందేల బరి వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. కోడిపందేలతో పాటు పేకాట శిబిరాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయని, సంక్రాంతి ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా జూదం రాజ్యమేలుతోందని పార్టీ ఆరోపించింది. కోడిపందేల బరుల వద్దే మద్యం అమ్మకాలు సాగుతున్నాయని, పబ్లిక్‌గా నిబంధనలను తుంగలో తొక్కుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించింది.

Advertisement

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక ‘కేసినో’లా మార్చివేసిందని YCP సోషల్ మీడియా పోస్ట్‌లో ఎద్దేవా చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయానికి లోబడి వేడుకలు జరుపుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. పోలీసులు అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి మూగప్రేక్షకులుగా మారుతున్నారని YCP నేతలు విమర్శిస్తున్నారు.

మ‌రోవైపు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కోడిపందాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగేళ్లపాలెం వద్ద కోడిపందాలు జరుగుతున్నాయన్న ముందస్తు సమాచారంతో పోలీసులు ఈ చర్య చేపట్టారు.

Advertisement

తొట్టంబేడు సీఐ తిమ్మయ్య, శ్రీకాళహస్తి టూ టౌన్ సీఐ ప్రకాష్ కుమార్, ఎస్సై జ్యోతి తమ సిబ్బందితో కలిసి పందేల బరిపై దాడి చేశారు. ఈ దాడుల్లో 13 మంది నిందితులను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుండి 4 పందెం కోళ్లు, 1500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పండగ పూట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×