E-Paper
Advertisement

Bangladesh: ఇండియాకు వెళ్లి వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడండి..లేక‌పోతే ప్రాణాలు తీస్తాం, బంగ్లా ఫ్యాన్స్ వార్నింగ్ ?

Bangladesh: ఇండియాకు వెళ్లి వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడండి..లేక‌పోతే ప్రాణాలు తీస్తాం, బంగ్లా ఫ్యాన్స్ వార్నింగ్ ?
Advertisement

Bangladesh:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాలో పర్యటించబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో ఆడకపోతే బోర్డుకు ఎలాంటి నష్టం ఉండబోదని.. నష్టమంతా కేవలం బంగ్లాదేశ్ క్రికెటర్ల పైన పడుతుందని వెల్లడించారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ అవకాశాన్ని కోల్పోతే ఎలాంటి పరిహారం ఉండబోదని… అసలు బంగ్లాదేశ్ క్రికెటర్లు మెరుగైన ప్రదర్శన చేయడం లేదంటూ ఫైర్ అయ్యారు. అటు ఇండియాకు వెళ్లి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఆడండి అంటూ మీర్ పూర్ స్టేడియం బ‌య‌ట ర‌చ్చ చేస్తున్నారు బంగ్లాదేశ్ ఫ్యాన్స్‌.

Also Read: Ind vs NZ 2nd ODI: కోహ్లీకి ఘోర అవ‌మానం..గంట‌న్న‌ర‌కే నెంబ‌ర్ 1 ర్యాంక్ గ‌ల్లంతు, రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ విక్ట‌రీ

BCB అధికారిపై బంగ్లాదేశ్ క్రికెటర్లు సీరియస్

Advertisement

పైన పేర్కొన్న వ్యాఖ్యలు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం చేసిన నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు చాలా సీరియస్ అవుతున్నారు. ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ ఏజెంట్ అంటూ తమీమ్ ఇక్బాల్ ను ఉద్దేశించి చేసిన‌ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అతన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని కూడా బంగ్లాదేశ్ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం నుంచి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ తో పాటు అంతర్జాతీయ మ్యాచ్ లు కూడా బహిష్కరిస్తామని బంగ్లాదేశ్ క్రికెటర్స్ అసోసియేషన్ వార్నింగ్ కూడా ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా దిగి వచ్చింది. నజ్ముల్ ఇస్లాంకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాదు నజ్ముల్ ఇస్లాంను పదవి నుంచి తొలగించుకున్నట్లు అధికారిక ప్రకటన చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. అయితే అప్పటికే సమయం గడిచిపోవడంతో గురువారం జరగాల్సిన రెండు మ్యాచ్లు వాయిదా పడ్డాయి.

మీర్ పూర్‌ స్టేడియం బయట బంగ్లాదేశ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ

Advertisement

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ నేప‌థ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుపై నేపథ్యంలో అభిమానులు చాలా సీరియస్ అయ్యారు. మీర్ పూర్‌ స్టేడియం బయట రచ్చ రచ్చ చేశారు. బ్యానర్లు అలాగే హోర్డింగ్స్ అన్ని పీకి పారేశారు. అలాగే ఇండియాలో బంగ్లాదేశ్ క్రికెటర్లు పర్యటించేలా వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో పర్యటించ‌కుండా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ నుంచి త‌ప్పుకుంటే, బంగ్లాదేశ్ క్రికెటర్ల ప్రాణాలు కూడా తీస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విష‌యంలో ఇండియాతో పెట్టుకోవ‌ద్ద‌ని కోరుతున్నార‌ట‌. ఇందులో భాగంగానే మీర్ పూర్‌ స్టేడియం బయట రచ్చ రచ్చ చేశారు బంగ్లా ఫ్యాన్స్‌ ( Bangladesh  Fans).

Also Read: Ind vs NZ 2nd ODI: తెలుగోడికి 2 ఓవ‌ర్లేనా..గిల్ ద‌రిద్ర‌మైన నిర్ణ‌యాలు..రెండో వ‌న్డేలో టీమిండియా ఓట‌మికి 5 కార‌ణాలు

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×