E-Paper
Advertisement

Perni Nani: పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకత.. ప్రభుత్వంపై పేర్నినాని తీవ్ర విమర్శలు

Perni Nani: పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకత.. ప్రభుత్వంపై పేర్నినాని తీవ్ర విమర్శలు
Advertisement

Perni Nani: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ (PPP – పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో నిర్మించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని మొదటి నుంచే వైసీపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తుండగా, తాజాగా అధికార పార్టీ నేతలు, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమైంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం పిలిచిన టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంపై ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలకు దిగాయి.

టెండర్లకు మిశ్రమ స్పందన రావడానికి వైసీపీ నేతలే కారణమని.. అధికార పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తుండగా, అందుకు వైసీపీ శ్రేణులు అదే స్థాయిలో ఘాటు కౌంటర్లు ఇస్తున్నాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాన్ని వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వమే నిధులు సమకూర్చి మెడికల్ కాలేజీలు నిర్మించి, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే డిమాండ్‌ను పార్టీ మరోసారి బలంగా వినిపిస్తోంది.

Advertisement

ఈ అంశంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన మరింత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైద్య రంగాన్ని ప్రైవేట్‌పరం చేయాలన్నదే కూటమి ప్రభుత్వ అసలైన లక్ష్యమని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తులు ప్రజాసేవ కోణంలో కాకుండా లాభాపేక్షతోనే పనిచేస్తారని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టడంలేదని విమర్శించారు.

పీపీపీ, పీ4 వంటి విధానాలతో ఎవరు బాగుపడ్డారో వారికే తెలియాలి. ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు. 90 పైసలకే 50 కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నారు. గూగుల్, టీసీఎస్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఇంత చౌకగా ఎక్కడైనా భూములు తీసుకున్నాయా? అంటూ పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. పేదల పేరు చెప్పి భూములను దోచుకునే విధానం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.

Advertisement

రాజధాని ప్రాంత రైతుల సమస్యలను కూడా ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పేర్ని నాని విమర్శించారు. సీఆర్‌డీఏ అధికారులు రైతుల గోడును పట్టించుకోవడంలేదని, భూములు ఇచ్చిన రైతులు నేటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల రైతులు, ఉద్యోగులు, కూలీలు ఇలా అన్ని వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆయన పేర్కొన్నారు.

Also Read: జీహెచ్ఎంసీ పునర్విభజన.. మూడు కమిషనరేట్లలో కీలక మార్పులు, ఇకపై కొత్తగా

కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల నుంచి కూలీల వరకు.. అందరూ భయంతో జీవిస్తున్నారు. గత 20 నెలల్లో ప్రజలను భయకంపితులను చేసే పరిపాలన జరిగింది. ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్నాయి అంటూ పేర్ని నాని ఆరోపించారు. వైద్య రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించాలనే తాపత్రయంతో చంద్రబాబు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×