E-Paper
Advertisement

Hyderabad: రూ.4 వేలకే ల్యాప్ టాప్.. భారీగా ఎగబడ్డ జనం.. చివరికి

Hyderabad: రూ.4 వేలకే ల్యాప్ టాప్.. భారీగా ఎగబడ్డ జనం.. చివరికి
Advertisement

Hyderabad: హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో రూ.4000కే ల్యాప్ టాప్ అని ఓ షాప్ యజమానులు ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసింది. పిల్లలు గేమ్స్ ఆడుకునేందుకు, సాధారణ పనులకు వినియోగించేలా ల్యాప్ టాప్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెప్పారు. వేల విలువైన ల్యాప్ టాప్ ఛీప్ గా దొరుకుతుండడంతో జనం బారులు తీరారు.

బంపర్ సెల్.. జనం బారులు

దిల్‌సుఖ్‌నగర్‌‌లో ఓ సంస్థ రూ.4,000కే ల్యాప్‌టాప్ బంపర్ సేల్ అంటూ ప్రకటన చేసింది. ఈ ప్రకటన చూసిన జనం ఆదివారం ఉదయం నుంచే ఆ షాప్ ముందు క్యూ కట్టారు. షాప్ వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. తక్కువ ధరకు బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు లభిస్తాయనే ఆశతో వివిధ ప్రాంతాల నుంచి వినియోగదారులు తరలివచ్చారు. రద్దీ గంట గంటకు పెరుగుతుండడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. షాపులోకి వెళ్లే మార్గం చిన్నగా ఉండడం జనం కిక్కిరిసి పోయారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని, తగిన ఏర్పాట్లు చేయాలని కొనుగోలుదారులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

సోషల్ మీడియాలో ప్రచారం

గత కొన్ని రోజులుగా రూ.4 వేలకే ల్యాప్ టాప్ అంటూ సోషల్ మీడియాలో వీడియోల్లో ఉదరగొట్టారు. సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ లను బాగుచేసి, అప్డేట్ చేసి అతి తక్కువకే ఇస్తున్నామని ఆ వీడియోల్లో ప్రచారం చేశారు. వందల ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయని, చాలా తక్కువ ధరకే పనిచేసే ల్యాప్ టాప్ ఇస్తున్నామని నిర్వాహకులు ప్రచారం చేశారు. కనీసం రూ.20-30 వేలు పెడితే కానీ సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ రాకపోవడం, రూ.4 వేలకే ల్యాప్ టాప్ అని చెప్పడంతో జనం బారులు తీరారు. దీంతో దిల్ సుఖ్ నగర్ లో రద్దీ నెలకొంది.

Advertisement

Also Read: KA Paul: ‘బాలయ్య కడుపు చేస్తా’ అంటే ఏం చేశారు?.. శివాజీ వివాదంపై కేఏ పాల్ ఫైర్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×