E-Paper
Advertisement

YS Sharmila: ఏపీపై మోదీకి సవతి తల్లి ప్రేమ: షర్మిల ఆగ్రహం

YS Sharmila: ఏపీపై మోదీకి సవతి తల్లి ప్రేమ: షర్మిల ఆగ్రహం
Advertisement

YS Sharmila: ఉత్తరాది రాష్ట్రాల్లో పకృతి విలయాలకు జాతీయ విపత్తుగా ప్రకటించుకునే ప్రధానీ మోదీ మాత్రం.. ఏపీపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు.

మొంథా తుఫాన్ ధాటికి జనజీవనం అల్లకల్లోలం అయితే.. తమకేం పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోదీ.. ఆపద సమయంలో మొహం చాటేసి మరోసారి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

మొంథా తుఫాన్ రైతన్నకు అపార నష్టాన్ని, తీరని శోకాన్ని మిగిల్చింది. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా నీట మునిగాయని, ఖరీఫ్ సీజన్ లో సాగైన పంటల్లో 30 శాతం పనికి రాకుండా పోయాయని, 10 లక్షల మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ఇది రాష్ట్ర రైతాంగానికి సంభవించిన మహా విపత్తు. రూ.20వేల కోట్లకు పైగానే రైతులకు జరిగిన అపార నష్టం ఇది వైఎస్ షర్మిల ఆరోపించారు.

ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇంత పెద్ద విపత్తు సంభవించినా చంద్రబాబు మౌనంగా ఉండటం సిగ్గుచేటు. 20 లక్షల ఎకరాలు పంట నష్టపోయిన పరిస్థితుల్లో కేవలం 2.88 లక్షల ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగిందని చెప్పడం రైతులను మోసం చేయడమే.

Advertisement

మోదీ చేసిన మోసాల్ని ఇన్నాళ్లు భరించాం. కానీ రైతులు ఆపదలో ఉన్నప్పుడు మౌనంగా ఉండడం చంద్రబాబుకి తగదు. ఇప్పుడైనా వెన్నుముక లాంటి రైతులకు అండగా నిలబడి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం తీసుకురావడం సీఎం ధర్మం” అని షర్మిల వ్యాఖ్యానించారు.

Also Read: ఆంధ్రా అడవులకు మరో అతిథి.. రేపో మాపో అడవి దున్నలు రాక!

వెన్నుముక లాంటి రైతన్నకు అండగా నిలబడే సమయం ఇది. పంటలతో పాటు ఆస్తి నష్టం అధికమే. సర్వం కోల్పోయిన వారి సంఖ్య లక్షల్లోనే. మోదీ మోసాలు చూస్తూ ఇన్నాళ్లు మోకరిల్లిన సీఎం చంద్రబాబు .. ఇప్పుడైనా నోరు విప్పండి. జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్ చేయండి. జరిగిన నష్టానికి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం తీసుకురండి. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×