// // మోదీ భజనపై ఉన్న శ్రద్ధ వరద బాధితులపై లేదా? వైఎస్ షర్మిల -->
E-Paper
Advertisement

మోదీ భజనపై ఉన్న శ్రద్ధ వరద బాధితులపై లేదా? కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్!

మోదీ భజనపై ఉన్న శ్రద్ధ వరద బాధితులపై లేదా? కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్!
Advertisement

YS Sharmila: గోదావరి వరదలతో వందలాది గ్రామాలు నీట మునిగి ప్రజలు అల్లల్లాడుతుంటే, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాత్రం బాధితులను పట్టించుకోకుండా ప్రధాని మోదీ భజనలోనే నిమగ్నమైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని గొప్పోడని, మొనగాడని పొగడటానికి ఉన్న ఆసక్తి.. సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోవడంలో చూపకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని కోసం కన్నీళ్లు.. ప్రజల గోస కనపడదా?

Advertisement

గోదావరి ఉగ్రరూపంతో దాదాపు 100 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 20 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్లకు ఊళ్లు నీట మునుగుతుంటే తక్షణ పునరావాసం కల్పించాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ‘మోదీ తిడితే కంట కన్నీరు పెట్టుకునే నాయకులకు, ఇళ్లు ఖాళీ చేసి తట్టా బుట్ట పట్టుకుని వెళ్తున్న నిర్వాసితుల కన్నీటి గోడు ఎందుకు వినపడటం లేదు?’ అని ఆమె నిలదీశారు. వరదలు వస్తాయని తెలిసి కూడా ముందస్తుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల డిమాండ్లు..

Advertisement

ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల పలు డిమాండ్లు చేశారు.

బాధితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి మెరుగైన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల్లో నాణ్యమైన భోజనం, తాగునీరు అందించడంతో పాటు అవసరమైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వరద ప్రభావంతో అనారోగ్యాల బారిన పడేవారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని.. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణీల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏటా ఎదురవుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా, పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు తక్షణమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని చెల్లించి, వారిని సురక్షిత ప్రాంతాల్లో శాశ్వతంగా పునరావాసం కల్పించాలని తెలిపారు.అదే విధంగా వరద ఉధృతి తగ్గే వరకు ప్రభుత్వం ప్రతి ఒక్క బాధితుడికి పూర్తి భరోసా అందించాలని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

Also Read: ముగ్గురినే ఉతికి ఆరేశాం.. మిగిలిన 21 మంది వైసీపీ నాయకులను వదిలేదే లేదు!- జేసీ ప్రభాకర్ రెడ్డి

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×